బూతు సినిమాకి అప్పుడే 2 కోట్లు

Update: 2015-11-03 22:30 GMT
బాలీవుడ్ లో బూతు సినిమాల బాగోతం బాగా జోరుమీదుంది. స్టార్ల సినిమాలను మించిపోయి క్రేజ్ సంపాదించేస్తున్నాయి అడల్డ్ మూవీస్. అడపాదడపా స్టార్స్ అయినా ఫెయిల్ అవుతారేమో కానీ.. ఇవి మాత్రం పెట్టుబడికి ఐదారు రెట్లు సంపాదించిపెట్టేస్తున్నాయి నిర్మాతలకు. ఇప్పుడు రాబోతోన్న హేట్ స్టోరీ3 కూడా ఇలాగే సంచలనాలు సృష్టిస్తోంది.

సల్మాన్ ఖాన్ పక్కన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. లక్కు తోక ఎక్కడుందో ఇంకా వెతుక్కుంటోంది జరీన్ ఖాన్. ఈమె లీడ్ రోల్ లో నటించిన హేట్ స్టోరీ3 యూట్యూబ్ లో సంచనాలు సృష్టిస్తోంది. ట్రైలర్ రిలీజ్ అయిన రెండువారాల్లో కోటీ 87 లక్షల వ్యూస్ వచ్చాయి. అంటో మరో రెండు రోజుల్లో రెండు కోట్లు దాటిపోవడం ఖాయమన్నమాట.

సల్మాన్ ఖాన్ నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయోకి.. ఇప్పటివరకూ యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ 1.68 కోట్లే. అంటే సల్లూభాయ్ కంటే.. సెక్సీ మూవీస్ కే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని అనుకోవాలేమో ఇపుడు. అందుకే.. మేకర్స్ కూడా ఈ అడల్ట్ చిత్రాలకే మొగ్గుతున్నారు.
Tags:    

Similar News