చిత్రం : ‘హలో’
నటీనటులు: అక్కినేని అఖిల్ - కళ్యాణి ప్రియదర్శన్ - జగపతిబాబు - రమ్యకృష్ణ - అనీష్ కురువిల్లా - సత్యకృష్ణ - అజయ్ తదితరులు
సంగీతం: అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం: పి.ఎస్.వినోద్
నిర్మాత: అక్కినేని నాగార్జున
రచన - దర్శకత్వం: విక్రమ్ కె.కుమార్
హీరోగా అక్కినేని అఖిల్ అరంగేట్ర సినిమా ‘అఖిల్’ చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో అఖిల్ ను హీరోగా నిలబెట్టే బాధ్యత అతడి తండ్రి నాగార్జునే తీసుకున్నాడు. ‘మనం’తో మనసు దోచిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘హలో’ సినిమాను నిర్మించాడు. ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ‘హలో’తో అఖిల్ ఏమేరకు మెప్పించాడు.. ఈ సినిమా అతడికి ఎలాంటి ఫలితాన్నిచ్చేలా ఉంది.. చూద్దాం పదండి.
కథ:
శీను ఒక అనాథ. అతడికి చిన్నతనంలో జున్ను అనే అమ్మాయి పరిచయమవుతుంది. వాళ్లిద్దరూ చాలా దగ్గరవుతారు. ఐతే జున్ను తండ్రికి ఉన్న ఊరి నుంచి బదిలీ కావడంతో ఆమె శీనుకు దూరమవుతుంది. వెళ్తూ వెళ్తూ శీనుకు ఒక ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్తుంది జున్ను. కానీ దాన్ని పోగొట్టుకుంటాడు. తర్వాత శీనును ఓ పెద్దింటి కుటుంబం దత్తత తీసుకుంటుంది. అతడి లైఫ్ మారిపోతుంది. కానీ జున్ను కోసం అతడి ప్రయత్నం మాత్రం ఆగదు. ఆమెను కలవడానికి అతను ఎంతగానో తపిస్తుంటాడు. ఆ తపనతోనే పెద్దవాడవుతాడు. మరోవైపు జున్ను కూడా శీను కోసమే నిరీక్షిస్తుంటుంది. మరి వీళ్లిద్దరూ కలిశారా.. అందుకోసం వాళ్లేం చేశారు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
‘హలో’ సినిమా టీజర్.. ట్రైలర్ చూస్తే అందులో అందరి దృష్టినీ ఆకర్షించింది యాక్షన్ సన్నివేశాలే. ఇక ‘హలో’ ఆడియోతో అనూప్ రూబెన్స్ మ్యాజిక్ చేసేశాడు. ప్రతి పాటా మనసుకు హత్తుకునేలా ట్యూన్ చేశాడు. ఈ సినిమా ప్రోమోస్ అన్నింట్లోనూ విజువల్స్ కంటికి చాలా ఇంపుగా.. ఆహ్లాదంగా కనిపించాయి. దీంతో పాటుగా ప్రొడక్షన్ వాల్యూస్ హై స్టాండర్డ్స్ లో ఉన్నట్లుగా కనిపించాయి. ‘హలో’ చూస్తున్నంతసేపూ మన దృష్టిని ఎక్కువగా ఆకర్షించేది.. సినిమాలో ఎక్కువ హైలైట్ అయ్యేది ఈ అంశాలే. కథాకథనాల పరంగా చూస్తే ‘హలో’ మామూలుగానే అనిపిస్తుంది. ఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేస్తుంది కానీ విక్రమ్ కుమార్ నుంచి ‘మనం’ తరహా మ్యాజిక్ మాత్రం ఇందులో మిస్సయింది.
ఎప్పట్నుంచో చూస్తున్న పాత కథను అందమైన ప్యాకేజీ రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ గొప్పగా ఉన్నపుడు.. దృశ్యం అందంగా కనిపిస్తున్నపుడు.. వీనుల విందైన సంగీతం ఆహ్లాదాన్ని పంచుతున్నపుడు మామూలు సన్నివేశాలు కూడా బాగా అనిపిస్తాయనడానికి ‘హలో’ రుజువుగా నిలుస్తుంది. చిన్నపుడు విడిపోయిన ఓ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు సోల్ మేట్ గా భావిస్తూ.. పెద్దయ్యాక కూడా ఒకరినొకరు తలుచుకుంటూ.. ఒకరి కోసం ఒకరు అన్వేషిస్తూ.. చివరికి ఎలా ఒక్కటయ్యారన్నదే ‘హలో’ కథాంశం. అచ్చంగా ‘మనసంతా నువ్వే’ను తలపించే ప్లాట్ ఇది. దీన్ని ‘మనం’ తరహాలో ‘డెస్టినీ’తో ముడిపెట్టి.. అందంగా.. తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశాడు విక్రమ్.
కానీ అద్భుతాలు అన్నిసార్లూ జరగవు.. అనుకోకుండా జరిగిపోతాయనడానికి ‘మనం’ రుజువుగా నిలిస్తే.. దాన్ని అనుకరించే ప్రయత్నం చేయడం వల్ల ‘హలో’ అంత ఒరిజినల్ గా అనిపించదు. ‘మనం’లో వాటంతటవే ఎమోషన్లు పండాయి. కానీ ‘హలో’లో ఈ ఎమోషన్ కోసం ఎవరికి వాళ్లుగా కొంచెం మోటివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కెమెరా పనితనం.. వీనుల విందైన సంగీతం.. కళా దర్శకుడి నైపుణ్యం.. వీటికి తోడు విక్రమ్ కుమార్ మార్కు నరేషన్ వల్ల అక్కడక్కడా మంచి ఫీల్ కలుగుతుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం.. అన్ని చోట్లా ఎమోషన్ పండకపోవడం.. ప్రేమ కథలో సోల్ మిస్సవడంతో ‘హలో’ ఉండాల్సినంత గొప్పగా అనిపించదు. ఇంకా ఏదో ఉండాల్సిందన్న భావన కలుగుతుంది.
‘హలో’ ఆరంభంలో హీరో హీరోయిన్ల చిన్నతనం నేపథ్యంలో సాగే సన్నివేశాలు అందంగా ఉన్నప్పటికీ అందులోని అసహజత్వం కొంత ఇబ్బందిగా మారుతుంది. స్లో నరేషన్ వల్ల ఈ ఎపిసోడ్ కొంచెం సుదీర్ఘంగా సాగిన భావన కలుగుతుంది. అరగంటకు పైగా ఈ ఎపిసోడ్ ను నడిపించడం సాహసమే. దీన్ని మినహాయిస్తే ప్రథమార్ధమంతా యాక్షన్ సన్నివేశాలతోనే నింపేశారు. హాలీవుడ్ స్థాయికి ఏమాత్రం తగ్గని రీతిలో కళ్లు చెదిరే రీతిలో ఆ సన్నివేశాల్ని తీర్చిదిద్దినప్పటికీ.. ఈ కథకు అవి ఎంత మేరకు అవసరం అన్న సందేహం కలుగుతుంది. ఇక ద్వితీయార్ధంలో ప్రధానంగా కథ మీదే సినిమా నడుస్తుంది. హీరో హీరోయిన్లు తమ అసలు నేపథ్యం తెలియకుండా వేరే వ్యక్తులుగా కలవడం.. వారి మధ్య బంధం ఏర్పడటం.. ఈ నేపథ్యంలో సాగే ఎపిసోడ్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. కథ కొంచెం వేగంగా సాగేది ఇక్కడే.
ఇక పతాక సన్నివేశాల్ని ఎమోషనల్ గా నడిపించే ప్రయత్నం చేశాడు విక్రమ్. అంతిమంగా నాయికా నాయికలు కలిసే సన్నివేశంలో మెలోడ్రామా కొంచెం ఎక్కువైన భావన కలిగినప్పటికీ.. అది ఆకట్టుకుంటుంది. ఐతే హీరో హీరోయిన్లు ఒకరి కోసం ఇంకొకరు ఎంతగా తపిస్తున్నారనే విషయం ముందు నుంచి మరింత ప్రభావవంతంగా చూపాల్సింది. అలా జరిగి ఉంటే వాళ్లు కలవాలనే బలమైన ఎమోషన్ ప్రేక్షకుల్లో కలిగేది. ‘మనం’ను గుర్తుకు తెచ్చేలా ఇందులో ‘డెస్టినీ’ ప్రస్తావన చాలాసార్లు వస్తుంది. అంతే కాక అందులో మాదిరే ‘యాదృచ్ఛికంగా’ చాలా విషయాలు జరిగిపోతాయి. మరీ పదిహేనేళ్ల కిందట హీరో పోగొట్టుకున్న వంద రూపాయల నోటు సరిగ్గా క్లైమాక్సులో అతడికి దొరకడం అన్నది అతిగా అనిపించే కోయిన్సిడెన్స్. ఓవరాల్ గా చెప్పాలంటే.. మంచి ప్యాకేజీతో వచ్చిన ‘హలో’ ప్రేక్షకుల్ని చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. కాకపోతే విక్రమ్ కుమార్.. నాగార్జున.. పి.ఎస్.వినోద్.. అనూప్ రూబెన్స్.. అఖిల్.. మనం ఎంటర్ ప్రైజెస్.. ఈ పేర్లన్నీ చూసి ఇది మరో ‘మనం’లా ఉంటుందనుకుంటే నిరాశ తప్పదు.
నటీనటులు:
అక్కినేని అఖిల్ తొలి సినిమాతో పోలిస్తే.. నటుడిగా మెరుగ్గా అనిపిస్తాడు. ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా విక్రమ్ స్టయిల్లో సింపుల్ గా నటించే ప్రయత్నం చేశాడు. ఐతే హావభావాల విషయంలో మరింత మెరుగవ్వాలి. ఐతే ఈ సినిమా కోసం అఖిల్ పడ్డ కష్టాన్ని మాత్రం తక్కువ చేయలేం. పార్కౌర్ స్టయిల్లో సాగే యాక్షన్ సన్నివేశాల్లో అఖిల్ అదరగొట్టేశాడు. ఇక డ్యాన్సుల విషయంలో ‘అఖిల్’లో మాదిరి అతిగా ప్రయాస పడకుండా సింపుల్ గా అందంగా అనిపించేలా చేశాడు. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని రెగ్యులర్ హీరోయిన్లలా అనిపించదు. ఆమె గొప్ప అందగత్తె ఏమీ కాదు కానీ.. ఈ సినిమాకు సరిపోయింది. ఈ కథకు తగ్గట్లుగా సున్నితంగా కనిపించి ఆకట్టుకుంది. రమ్యకృష్ణ.. జగపతిబాబు పాత్రలకు తగ్గట్లుగా నటించారు. అజయ్ ప్రత్యేకత చాటుకునే పాత్ర ఏమీ కాదిది. అనీష్ కురువిల్లా.. సత్యకృష్ణలవి చిన్న పాత్రలు.
సాంకేతికవర్గం:
‘హలో’లో టెక్నికల్ బ్రిలియన్స్ అడుగడుగునా కనిపిస్తుంది. ప్రతి టెక్నీషియన్ గొప్ప ఔట్ పుట్ ఇచ్చాడు. అనూప్ రూబెన్స్ తన పాటలు.. నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. ప్రతి పాటా బాగుంది. వాటి చిత్రీకరణ కూడా ఆకట్టుకుంటుంది. పి.ఎస్.వినోద్ కెమెరాతో మ్యాజిక్ చేశాడు. ఆద్యంతం ఆహ్లాదం పంచాడు. ఆర్ట్ వర్క్ కూడా చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్బ్. నిర్మాతగా నాగార్జున ఎక్కడా రాజీ పడలేదు. హాలీవుడ్ నుంచి వచ్చిన బాబ్ బ్రౌన్ యాక్షన్ కొరియోగ్రాఫీ సినిమాలో చెప్పుకోదగ్గ ఆకర్షణల్లో ఒకటి. ఇక దర్శకుడు విక్రమ్ కె.కుమార్ పాత కథను భిన్నమైన స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం చేశాడు. అతడి నరేషన్ ఎప్పల్లాగే నెమ్మదిగా అనిపిస్తుంది. సినిమాలో అతడి సిగ్నేచర్ స్టయిల్ అక్కడక్కడా కనిపిస్తుంది కానీ.. ‘ఇష్క్’.. ‘మనం’ సినిమాల్లో మాదిరి మ్యాజిక్ మాత్రం క్రియేట్ చేయలేకపోయాడు. విక్రమ్ నుంచి ప్రేక్షకులు ఇంకా ఎక్కువ ఆశిస్తారనడంలో సందేహం లేదు.
చివరగా: హలో.. అందమైన ప్యాకేజీలో మామూలు ప్రేమకథ
రేటింగ్-3/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre