సహజంగా ఓ కాంబినేషన్ క్లిక్ అయిందంటే.. దాన్ని రిపీట్ చేసేందుకు మేకర్స్ క్యూ కడుతుంటారు. డైరెక్టర్-హీరో.. హీరో-హీరోయిన్.. ఇలాంటి పలు కాంబినేషన్లపై ఆడియన్స్ లో కూడా ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా హీరో హీరోయిన్ కాంబోపై చాలానే హైప్ జనరేట్ అవుతూ ఉంటుంది. కానీ బ్లాక్ బస్టర్స్ కొట్టినా.. కొన్ని కాంబోలు మాత్రం రిపీట్ కాకపోవడం ఆశ్చర్యకరం.
ఖుషీ మూవీతో ఇండస్ట్రీ కొట్టేశాడు పవన్ కళ్యాణ్- భూమిక. కానీ మళ్లీ వీరిద్దరూ కలిసి నటించడం సాధ్యపడలేదు. పోకిరితో టాలీవుడ్ రికార్డులన్నీ తుడిచేశారు మహేష్- ఇలియానా. వీళ్లు కూడా మరోసారి నటించే అవకాశం రాలేదు. మలయాళీ భామ ఆసిన్ కెరీర్ లో మచి హిట్సే ఉన్నాయి. రవితేజతో అమ్మనాన్న ఓ తమిళమ్మాయి చిత్రంతో పరిచయమైన ఈమె.. ఆ తర్వాత నాగార్జునతో శివమణి.. బాలకృష్ణతో లక్ష్మీ నరసింహ చిత్రాల్లో నటించింది. అయితే.. వీరెవరితోనూ ఆశిన్ మరోసారి నటించకపోవడం ఆశ్చర్యకమరైన విషయం.
మహేష్ బాబు- భూమిక కూడా సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఒక్కడు బ్లాక్ బస్టర్ అయినా.. మరోసారి వీరిద్దరూ కలిసే అవకాశం రాలేదు. జల్సాలో పవన్ తో.. బన్నీతో జులాయిలో నటించిన ఇల్లీ బేబీకి.. మళ్లీ వాళ్లతో కలిసి నటించే అవకాశం రాలేదు. అలాగే ఎన్టీఆర్ తో కలిసి ఆది అంటూ హిట్ కొట్టిన కీర్తి చావ్లాకు మళ్లీ ఆ కాంబోను రిపీట్ చేయలేదు. ఆర్యతో మొదటి బిగ్ హిట్ అల్లు అర్జున్.. అను మెహతాతో మళ్లీ నటించలేదు. రామ్ చరణ్ తన తొలి హీరోయిన్ నేహాశర్మతో మరోసారి కలిసి నటించలేదు.