దీపావళి పండుగ వేళ.. తీరని విషాదం చోటు చేసుకుంది టాలీవుడ్ హీరో రాజశేఖర్ ఇంట. ఆయన తండ్రి 93 ఏళ్ల వరదరాజన్ గోపాల్ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. గడిచిన కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన్ను ఆసుపత్రిలో చేర్చారు. కొద్దిరోజులుగా సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. దీంతో.. వారి కుటుంబం విషాదం నెలకొంది. హీరో రాజశేఖర్ తండ్రి విషయానికి వస్తే ఆయన చెన్నై డీఎస్పీగా పని చేసి రిటైర్ అయ్యారు.
ఆయనకు మొత్తం ఐదుగురు సంతానం. ముగ్గురు కుమారులు.. ఇద్దరు కుమార్తెలు. వరదరాజన్ రెండో సంతానమే హీరో రాజశేఖర్. శుక్రవారం ఉదయం వరదరాజన్ భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి తరలించనున్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలోనే జరగనున్నట్లు రాజశేఖర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ విసాద వార్త తెలిసిన సినీ రంగానికి చెందిన పలువురు తం సంతాపాన్ని వ్యక్తం చేశారు.