కేటీఆర్ గారు మంచి నటుడు కూడా

Update: 2021-11-17 04:18 GMT
తెలంగాణ విజువల్ ఎఫెక్ట్స్ .. యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ఇండియా జాయ్' పేరుతో మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ ఫెస్టివల్, మంగళవారం రోజున హైదరాబాద్ .. హైటెక్స్ లో ఆరంభమైంది. ఈ కారక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రమేశ్ తో పాటు హీరో సుధీర్ బాబు కూడా హాజరయ్యారు. యానిమేషన్ రంగ నిపుణులు .. పారిశ్రామికవేత్తలు .. పెట్టుబడిదారులు పాల్గొన్నారు.

సుధీర్ బాబు మంచి నటుడు మాత్రమే కాదు .. బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "నేను కేటీఆర్ గారికి పెద్ద ఫ్యాన్ ని. ఆయన మంచి పొలిటీషియన్ మాత్రమే కాదు .. మంచి నటుడు కూడా. ఏ నటుడైనా వేరే పాత్ర చేయాలంటే తనని తాను మరిచిపోయి, వేరే పాత్రలోకి ప్రవేశించాలి.

అలా చేస్తేనే ఆ పాత్రకి న్యాయం చేసినవాళ్లమవుతాము. అలాగే పొలిటీషియన్స్ కూడా .. తమచుట్టూ ఉన్నవారి బాగోగులు చూసుకోవాలన్నా తమని తాము మరిచిపోయి పనిచేయవలసి ఉంటుంది. అలాంటి ఓ మంచి పొలిటిషియన్ ను నేను కేటీఆర్ గారిలో చూశాను.

ఇక 'ఇండియా జాయ్' ఈవెంట్ విషయానికి వస్తే .. "మనకి నిజమైన స్నేహితులు ఎవరనే విషయాన్ని అంతా బాగా జరుగుతున్నప్పుడు తెలుసుకోవడం చాలా కష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే మన నిజమైన స్నేహితులు ఎవరనేది మనకి తెలుస్తుంది. అలాగే ఈ ఈవెంట్ కూడా .. చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో పోస్టు కోవిడ్ పరిస్థితుల్లో వస్తున్నాము.

ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఈవెంట్ ను ఆర్గనైజ్ చేయడమనేది గొప్పవిషయం. అందుకు నేను అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. కరోనా సమయంలో సినిమా ఇండస్ట్రీ చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంది. అలాంటి సమయంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ కి ఆదరణ పెరిగింది.

ఓటీటీ వలన కొత్త టాలెంట్ వస్తోంది .. బౌండరీస్ లేకుండా కొత్త ప్రాజెక్టులను రెడీ చేసుకోవచ్చు. థియేటర్లలో సినిమాలంటే కొన్ని లెక్కలు ఉంటూ ఉంటాయి. క్రియేటివిటీ పరంగా కొన్ని పరిధులు ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఐపీఎల్ లాంటిది .. మంచి డ్రామా కూడా ఉంటుంది.

మెయిన్ మ్యాచెస్ లాంటి సినిమాలను మాత్రం థియేటర్లలోనే చూస్తే బాగుంటుంది. మీ అందరూ ఇక్కడికి వచ్చారు .. అందరం ఇక్కడ కలిశామంటేనే ఈ ఈవెంట్ ను మీరు సపోర్టు చేస్తున్నారనే విషయం అర్థమవుతోంది" అంటూ చెప్పుకొచ్చాడు.




Tags:    

Similar News