చిన్మయి vs వైరముత్తు : ఇది విశాల్‌ స్పందన

Update: 2018-10-15 06:08 GMT
తమిళం మరియు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన చిన్మయి తాజాగా మీటూ ఉద్యమంలో కీలకంగా  నిలవడంతో ఇప్పుడు ఈమె గురించి దేశ వ్యాప్తంగా చర్చించుకుంటున్నారు. చిన్నప్పటి నుండి తనపై జరిగిన లైంగిక దాడి అనుభవాలను షేర్‌ చేసుకోవడంతో పాటు, ఇతరులు ఎదుర్కొన్న లైంగిక దాడులను కూడా తన సోషల్‌ మీడియా పేజ్‌ ద్వారా షేర్‌ చేసింది. సింగర్స్‌ అయిన తన స్నేహితులు ఎదుర్కొన్న లైంగిక దాడులను ఆమె మీడియా ముందుకు తీసుకు రావడంతో ఒక్కసారిగా ఆమె పేరు మారుమ్రోగి పోతుంది.

తమిళ లెజెండ్‌ రచయిత వైరముత్తుపై ఈమె సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో అంతా షాక్‌ లో ఉన్నారు. తమిళ సినీ పరిశ్రమలో వైరముత్తు అంటే అందరికి గౌరవం. అందుకే చిన్మయికి మద్దతుగా నిలిచేందుకు సినీ ప్రముఖులు ముందుకు వచ్చేందుకు సిద్దంగా లేరు. ఇలాంటి సమయంలో నడిగర్‌ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు అయిన విశాల్‌ స్పందించాడు. సినిమా పరిశ్రమలో హీరోయిన్స్‌, నటీమణులు, ఇతర టెక్నీషియన్స్‌ ఎవరైనా లైంగిక దాడి, మరియు ఇతర ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలని ఆయన కోరాడు.

గతంలో అమలా పాల్‌ ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మా దృష్టికి తీసుకు వస్తే వెంటనే సమస్యకు పరిష్కారించేందుకు ప్రయత్నించాం. ఇప్పుడు కూడా ఎవరైనా తమ వద్దకు వస్తే తప్పకుండా న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తామని విశాల్‌ హామీ ఇచ్చాడు. అదే సమయంలో చిన్మయి ఆరోపణలు చేస్తున్న వైరముత్తును కోలీవుడ్‌ నుండి బహిష్కరిస్తారా అంటూ ప్రశ్నించిన సమయంలో.. ఆయనపై నిషేదం నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేమని, ఆయన ఎదుర్కొంటున్న ఆరోపణలు నిజమా కాదా అనే విషయం నిగ్గు తేలే వరకు చర్యలు తీసుకోలేమని ఆయన చెప్పుకొచ్చాడు.
Tags:    

Similar News