ఎన్టీఆర్ నటించిన జై లవకుశ థియేటర్లలో బాగా సందడి చేసేస్తోంది. తొలి రోజున బంపర్ కలెక్షన్స్ ను కొల్లగొట్టిన ఈ చిత్రం.. వీకెండ్స్ లో మరింతగా పెర్ఫామ్ చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పుడీ మూవీ విషయంలో ఓ డౌట్ అందరినీ తెగ వేధించేస్తోంది. అసలు జై లవకుశ మూవీ విషయంలో మొదటగా వచ్చిన అప్డేట్ గుర్తుందా!
కేవలం కళ్లు లేకుండా ఎన్టీఆర్ ఫేస్ మాత్రమే కనిపించే ఓ మాస్క్.. ఈ ఏడాది ప్రారంభంలో ఇంటర్నెట్ లో బాగానే హల్ చల్ చేసింది. హాలీవుడ్ మేకప్ మ్యాన్ వాన్స్ హార్ట్ వెల్ తో జై పాత్రకు మేకప్ వేయిస్తున్నారనే విషయం బైటకు వచ్చింది. ఎన్టీఆర్ మాస్క్ కి కూడా బాగానే ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ చిత్రంలో జై పాత్ర చాలా ప్రత్యేకమైనది కావడంతో.. ప్రోస్థటిక్ మేకప్ తో ఈ రోల్ ను చేస్తున్నారని చెప్పారు. అయితే.. ఇప్పుడు సినిమా థియేటర్లలోకి వచ్చింది. జై పాత్రతో పాటు లవ కుశలను కూడా జనాలు చూసేశారు. అన్ని పాత్రలు ఒకేలా కనిపించాయి. మేకప్ వేరియేషన్ ఏమీ లేదు. పైగా సినిమాలో సగభాగం పాటు.. మూడు పాత్రలు ఒకే గెటప్ లో ఉంటాయ్ కూడా.
మరి జై పాత్రకు ప్రోస్థటిక్ మ్యాకప్.. హాలీవుడ్ టచ్ ఏమైపోయాయి అనిపించక మానదు. అదే అసలు విషయం. ఇలా మేకప్ హంగామాతో సినిమా చేయాలంటే.. చాలా సమయమే పడుతుంది. ఈ మేకప్ వేసేందుకు రోజుకు 4-5 గంటలు.. తీసేందుకు రెండు గంటలు పడుతుంది. పైగా ఒకసారి మేకప్ వేశాక 6 గంటలు మాత్రమే అది ఉంటుంది. ఇదంతా చేస్తే.. సినిమా ఏళ్లపాటు తీయాలి. పైగా మూవీని సొంత బ్యానర్ పై తీయడంతో తక్కువ టైంలో.. తక్కువ ఖర్చులో ఫినిష్ చేయాలనే టార్గెట్ కు.. ఈ మేకప్ అడ్డం అవుతుంది. అందుకే ఆ హాలీవుడ్ టచ్ ను పక్కన పడేసి.. తన నటనలో వేరియేషన్ తోనే మూడు పాత్రలు పండించాడు ఎన్టీఆర్.