ప్రస్తుతం రోజుల్లో సినిమా ఆడియో అంటే ఒక ఆల్బమ్ లా కాకుండా ఒక్కో పాట అందరికి గుర్తుండాలని మన సంగీత దర్శకులు చాలా కష్టపడుతున్నారు. లిరిక్స్ లో కూడా అక్షరాలకు సరికొత్త అర్దాన్ని చెప్పేలా రచయితలు కూడా పెన్నుకు పదును పెడుతున్నారు. చాలా వరకు ఈ మధ్య పాటల్లో అర్థం ఉండడం లేదని చాలా మంది కామెంట్స్ చేయడం కామన్ అయిపోయింది.
కానీ కొన్ని సందర్బాల్లో కొన్ని సినిమాల్లో నుంచి పుట్టుకొస్తున్న పాటలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తున్నాయి. అలాంటి ఫీలింగ్ కలిగేలా రీసెంట్ గా ఓ పాట రిలీజ్ అయ్యింది. నాని నెక్స్ట్ సినిమా కృష్ణార్జున యుద్ధం సినిమాలో నుంచి చిత్ర యూనిట్ మొదటి పాటను రిలీజ్ చేశారు. ఐ వన్న ఫ్లై అనే సాంగ్ మొదటి సారి వినగానే అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. నాని సినిమాలో చాలా వరకు మ్యూజిక్ హిట్ అవుతుందని అందరికి తెలిసిందే
కృష్ణార్జున యుద్ధం సినిమాకు కోలీవుడ్ సంగీత దర్శకుడు హిప్ హప్ తమిజా మ్యూజిక్ అందించాడు. మొదటి ట్యూన్ లోనే తమిజా బాగా ఆకట్టుకున్నాడు. పాటలో ప్రేమికుడు ప్రేయసి కోసం పడే తపన గురించి అందరికి అర్థమయ్యేలా శ్రీజో లిరిక్స్ అందంగా రాశారు. పాటకు తగ్గట్టుగా రేవంత్ సంజీత్ గానం కరెక్ట్ గా సెట్ అయ్యాయి. ముఖ్యంగా ఒక్క గుండె సరిపోదు.. అనే లైన్ హార్ట్ టచింగ్ గా ఉంది. సినిమాలో కథ పరంగా వచ్చిన సాంగ్ అని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమా సమ్మార్ లో రాబోతోన్న సంగతి తెలిసిందే. మెర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Full View