ఇటీవల కాలంలో టాలీవుడ్ లో డబ్బింగ్ చిత్రాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన చిత్రాలను స్టార్ ప్రొడ్యూసర్స్ తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయటానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో గత వారం "లవ్ టుడే" వంటి తమిళ్ డబ్బింగ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నేటి యువతరం భావాలకు అద్దంపట్టే అంశాలతో న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా "లవ్ టుడే" సినిమా తెరకెక్కింది. ప్రదీప్ రంగనాథన్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఇవానా హీరోయిన్ గా నటించింది. సత్యరాజ్ - రాధిక శరత్ కుమార్ - యోగిబాబు - రవీనా రవి కీలక పాత్రలు పోషించారు.
చిన్న సినిమాగా వచ్చిన "లవ్ టుడే".. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. గత శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.. రివ్యూలు కూడా బాగానే ఉన్నాయి. అయితే దానికి తగ్గట్టుగా పబ్లిసిటీ చేయకపోవడంతో వసూళ్ళు ఏమంత గొప్పగా ఏమీ లేవు.
'లవ్ టుడే' సినిమా ఫస్ట్ వీక్ లో ఇప్పటి వరకూ 'లవ్ రూ.7 - 8 కోట్ల నెట్ కలెక్షన్స్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబతున్నాయి. అయితే ఈ వీకెండ్ లో 'హిట్ 2' వంటి క్రేజీ సినిమా థియేటర్లలోకి వస్తోంది కాబట్టి.. డబ్బింగ్ చిత్రానికి అధిక వసూళ్ళు ఆశించలేం. కాకపొతే ఫుల్ రన్ లో 10 కోట్ల వరకూ రాబట్టే అవకాశం ఉంది.
తమిళ్ లో అంతటి ఘన విజయం సాధించిన సినిమాకి.. తెలుగులో మంచి టాక్ - పాజిటివ్ రివ్యూలు వచ్చినా.. పది కోట్లు అంటే తక్కువనే అనుకోవాలి. అదే పబ్లిసిటీ చేసి ఉంటే "లవ్ టుడే" సినిమా ఇంకా బాగా వసూలు చేసేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
కంటెంట్ బాగుంటే సోషల్ మీడియానే సినిమాను జనాల్లోకి తీసుకెళ్తుందని.. మౌత్ పబ్లిసిటీనే ముఖ్యమని దిల్ రాజు ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు. అందుకే ఇప్పుడు "లవ్ టుడే" సినిమాకి పెద్దగా ప్రమోషన్స్ చేయలేదేమో మరి. ఒక చిన్న ప్రమోషనల్ ఈవెంట్ చేయడం తప్పితే పబ్లిసిటీ పరంగా నిర్మాత ఏమంత హడావుడి చేయలేదు.
ఎంత మంచి కంటెంట్ ఉన్న సినిమా అయినా దానికి తగ్గట్టుగా ప్రమోషన్స్ చేస్తే.. జనాలకు మరింత చేరువ అవుతుంది. దిల్ రాజు డబ్బింగ్ మూవీ అని వదిలేయకుండా.. కొంచం ప్రమోషన్స్ చేసి ఉంటే "లవ్ టుడే" సినిమా రేంజ్ వేరేలా ఉండేదని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.