నాని.. సుధీర్ బాబులు నటించిన 'వి' సినిమా డైరెక్ట్ ఓటీటీ కి రిలీజ్ అయ్యింది. తెలుగులో మొదటి డైరెక్ట్ ఓటీటీ మూవీ ఇదే అవ్వడంతో అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఒక పెద్ద సినిమా రాబోతుంది అనే ఉత్సాహంతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తాజా ఇంటర్వ్యూలో చెప్పాడు. మల్టీ స్టారర్ సినిమా అంటూ చెబుతూనే నానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాటికి దర్శకుడు సమాధానం ఇచ్చాడు.
సినిమాలో ఇద్దరి పాత్రలు కూడా హోరా హోరీగా ఉంటాయి. ఇద్దరు కూడా సమ ఉజ్జీలుగా కథలో ఉంటారు. నాని కంటే సుధీర్ బాబు పాత్ర తక్కువ ఉంటుందనే అనుమానం అక్కర్లేదు. నాని స్థాయి పాత్రలో సుధీర్ కనిపించాడు. సమ్మోహనం సినిమాలో సుధీర్ బాబు నటన చూసిన సమయంలోనే అతడితో మళ్లీ మళ్లీ చేయాలనిపించింది. అయితే ఇంత త్వరగా వస్తుందని మాత్ర ఊహించలేదు.
సమ్మోహనంకు పూర్తి విభిన్నంగా ఈ సినిమాలో సుధీర్ బాబును చూస్తారు. ఆయన చేసిన ప్రతి పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకంను దర్శకుడు వ్యక్తం చేశాడు. సినిమా ఆలస్యం అయినా తప్పకుండా ఆకట్టుకునే విధంగా ఉంటుందనే నమ్మకంను యూనిట్ సభ్యులు కలిగించేందుకు తెగ ప్రచారం చేస్తున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత సినిమా పై చాలా మంది అంచనాలు పెంచేసుకున్నారు. అమెజాన్ ప్రైమ్ సబ్ స్ర్కిప్షన్ తీసుకుని మరీ వెయిట్ చేస్తున్నారు.