జయసుధ తాగే కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపి ఇచ్చారట..!

Update: 2022-02-01 10:40 GMT
ఇండస్ట్రీ జనాలకు వందలాది సినిమాలు సీరియల్స్‌ చేసిన సీనియర్ నటుడు మేకా రామకృష్ణ సుపరితమే. ప్రేక్షకులకు ఆయన పేరు తెలియకపోయినా.. మనిషిని చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టగలరు. 'బాహుబలి' సినిమాలో కుంతల సామ్రాజ్యపు రాజుగా.. దేవసేన అనుష్క శెట్టి సోదరుడిగా కనిపించింది ఈయనే. గత ముప్పై ఏళ్లుగా ఇండస్ట్రీకి సేవలు చేస్తున్న రామకృష్ణకు సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా బిజీగా ఉన్న ఆయన.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రొడక్షన్ హౌస్‌ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ లకు ఎదురయ్యే ఘోర అవమానాల గురించి వెల్లడించారు.

మేకా రామకృష్ణ మాట్లాడుతూ.. ''ఇండస్ట్రీలో మమ్మల్ని బాధపెట్టిన సంఘటనలు చాలా ఉన్నాయి. జీవితమే వేస్ట్ అని కళ్లనీళ్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని నిర్మాణ సంస్థల్లో ప్రొడక్షన్ బాయ్స్  చిన్న ఆర్టిస్ట్ లను చాలా ఘోరంగా ట్రీట్ చేస్తారు. నరకంలా అనిపిస్తుంది.. చాలా సిగ్గు అనిపిస్తుంది వాళ్లు ట్రీట్ చేసే విధానం చూస్తే. హే పో అని మనపై విసుక్కుంటారు. ప్రొడ్యుసర్ అన్నీ సమకూర్చి పెడతాడు. కానీ ఈ ప్రొడక్షన్ వాళ్లు ఉన్న దాన్ని సర్వ్ చేయడానికి నరకం చూపిస్తారు. అడుక్కునేవాడికి కూడా చాలా మర్యాదగా వేస్తారు.. కానీ ఈ ప్రొడక్షన్స్ బాయ్స్ చాలా నీఛంగా ప్రవర్తిస్తారు. ఎంత కోపం వస్తుందంటే.. నరికి పారేయాలనిపిస్తుంది. ఎందుకొచ్చిన గొడవలే అని ఇంటి నుంచి నా ఫుడ్ నేనే తీసుకుని వెళ్తా'' అని చెప్పారు.

''ఫుడ్ పెట్టే దగ్గర కూడా చాలామంది ప్రొడక్షన్ వాళ్ళు నాలుగైదు కేటగిరీలు పెట్టేస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌ లకు సెపరేట్ టెంట్ కానీ ఏదోకటి వేస్తూ ఉంటారు. ప్రొడ్యుసర్స్ - మెయిన్ హీరోలు ఒక దగ్గర.. టెక్నికల్ - డైరెక్షన్ టీమ్ మరో దగ్గర.. ఏజెంట్స్ ఉంటారు కాబట్టి జూనియర్ ఆర్టిస్ట్‌ లు.. సెకండ్ గ్రేడ్ టెక్నీషియన్లను మరో చోట ఉంచుతారు. అక్కడ సెకండ్ గ్రేడ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్‌లకు అయితే నరకం.. నీచాతి నీఛం. ఈ పాపం మీకు తగులుతుంది. నాశనం అయిపోతారని నేను తిట్టిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి''

''ఏ ప్రొడక్షన్ హౌస్ లో అయినా ఇంతే. ఈ విషయాలేవీ ప్రొడ్యుసర్లకు తెలియదు.. డైరెక్టర్లకు తెలియదు. ప్రొడక్షన్ బాయ్స్ చాలా నీచంగా చూస్తారు. వాళ్ల సొంత ఇంట్లో నుంచి తెచ్చిన సొమ్ములా ఫీల్ అవుతారు. నేనే కాదు.. ఎంతో మంది కళ్లలో నీళ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ప్రొడక్షన్ బాయ్స్‌ ని ఎవరైనా తిడితే.. వాళ్లకి ఇచ్చే కాఫీలో మోషన్ టాబ్లెట్లు కలిపి ఇస్తారట. ఆ కాఫీ తాగితే వారికి మోషన్స్ అవుతాయి. ఆ విధంగా కూడా టార్చర్ పెట్టేవాళ్ళు ఉన్నారండి. సీనియర్ నటి జయసుధ గారికి కూడా అలా చేసారంట''

''ఇలాంటివి చాలా జరిగాయి. అందుకే వాళ్ళతో ఎందుకులే అని ప్రొడక్షన్ బాయ్స్ కి అందరూ 'అన్నా' అని రెస్పెక్ట్ ఇచ్చి పిలుస్తుంటారు. ఇప్పుడంటే బాటిల్స్ ఇస్తున్నారు కానీ.. ఒకప్పుడు వాటర్ అడిగితే టాయిలెట్‌ లో ఉండే నీళ్లని బాటిల్స్‌ లో పట్టి ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అంత ఘోరంగా చేస్తారు. ప్రొడక్షన్స్ హౌస్‌ లో అందరూ అలానే ఉండరు. అందర్నీ అనలేం. కొంతమంది అయితే అమ్మ వండి పెట్టినట్టు పెడతారు'' అని మేకా రామకృష్ణ చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News