కమల్ హాసన్ హీరోగా నటించిన చీకటిరాజ్యం తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ మూవీగా పేరు తెచ్చుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ర్టాల్లో మొదటి రోజే 1 కోటి 4 లక్షలు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది. 86 లక్షల షేర్ వసూళ్లతో పంపిణీదారులను ఫుల్ ఖుషీ చేసింది. ఈ సంగతిని నైజాం పంపిణీదారుడు మల్టీడైమన్షన్ వాసు స్వయంగా తనంతట తానుగా వచ్చి సక్సెస్‌మీట్ లో సంతోషాన్ని వ్యక్తం చేయడంతో కమల్‌హాసన్ చాలా సర్‌ప్రైజ్ అయ్యారు. సేమ్ టైమ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఘిబ్రాన్ మ్యూ.జిక్ కంటే ఈ మ్యూజిక్ చాలా బావుందని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.
కమల్ హాసన్ మాట్లాడుతూ - "చీకటిరాజ్యం చాలా డిఫరెంట్ ఫిలిం. ఇలాంటి సినిమాలు నచ్చకపోతే మళ్లీ తీయాలని అనిపించదు. నచ్చితే మరెన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయాలని అనిపిస్తుంది. వెంట వెంటనే డిఫరెంట్ మూవీస్ తీసేందుకు స్కోప్ పెరుగుతుంది. తెలుగు ప్రేక్షకులు మరోచరిత్ర అనే చిత్రంతో డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు చీకటిరాజ్యం సక్సెస్ తో ప్రయోగాలు చేసేందుకు డోర్ ఓపెన్ చేశారు. తెలుగువారి నుంచి ఇంత మంచి ఆదరణ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో జిబ్రాన్ సంగీతం బావుందని అన్నారు. నేరుగా ఇలా సక్సెస్ మీట్ లో చీకటిరాజ్యం పంపిణీదారులు వచ్చి సక్సెస్ గురించి చెబుతుంటే చెవికి ఇంపుగా మ్యూజిక్ లా ఉంది. జిబ్రాన్ మ్యూజిక్ కంటే ఈ మాట చాలా బావుంది" అని చెప్పారు.
వాస్తవానికి నవంబర్ 10న తూంగవనం తమిళ్ లో రిలీజైనా అజిత్ సినిమాతో పోటీపడాల్సి వచ్చింది. పైగా అప్పటికి తమిళనాట వర్షాల భీభత్సం కలెక్షన్ల పై ప్రభావం చూపించింది. అందుకే కమల్ తెలుగు మూవీ సక్సెస్ విషయంలో చాలా ఎగ్జయిట్ అయ్యారు. అదీ మ్యాటరు.