విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఆస్తి ఎంత‌?

Update: 2019-02-09 08:29 GMT
స్టార్ హీరోగా దాదాపు మూడు ద‌శాబ్ధాల కెరీర్ ని సాగించిన క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌నా రంగంలో ఆరు ద‌శాబ్ధాల ప్ర‌స్థానం సాగించారు. పుట్టి పెరిగిందే న‌ట‌జీవితంలో. బాల‌చంద‌ర్ శిష్యుడిగా త‌మిళ‌- తెలుగు సినీరంగంలో ఎదురే లేని స్టార్ గా ఎదిగారు. యూనివ‌ర్శ‌ల్ స్టార్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించ‌కున్నారు. భార‌త‌దేశంలోనే అలాంటి మ‌రో స్టార్ పుట్ట‌బోడనడంలో సందేహ‌మే లేదు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త‌ర్వాత అంత‌టివాడిగా ప్ర‌ఖ్యాత‌ టైమ్స్ జాబితాలోనూ అత‌డి పేరు నిలిచింది. అయితే ఇన్నేళ్ల‌లో క‌మ‌ల్ సంపాదించిన ఆస్తులు ఎంత‌? అంటే అభిమానుల‌కు స‌రైన స్ప‌ష్ట‌త లేదు. అధికారికంగా చెప్పేది కొంత అయితే బ‌య‌ట‌క తెలియ‌నిదే ఎక్కువ అని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. డ‌బ్బు టు ద ప‌వ‌రాఫ్ డ‌బ్బు. ఆస్తి ఆస్తుల్ని పెంచుతుందే కానీ త‌గ్గించ‌దు. ఆ కోవ‌లో చూస్తే క‌మ‌ల్ హాస‌న్ ఆస్తులు ఇప్ప‌టికే 200కోట్లు పై మాటేన‌న్న టాక్ కూడా కోలీవుడ్ లో ఉంది. ఏడాదికి 8 కోట్లు పైగానే ఆదాయ‌పు ప‌న్ను చెల్లిస్తున్నారు.

సునాయాసంగా 50కోట్లు పైగా వార్షికాదాయం ఆర్జించే స‌త్తా ఉన్న స్టార్ క‌మ‌ల్ హాస‌న్. చెన్న‌య్ లో అత‌డి ఇంటి విలువ‌ రెండేళ్ల క్రితం 30 కోట్లుగా చెబితే దాని విలువ ఈ రెండేళ్ల‌లోనే అమాంతం పెరిగి రూ.55కోట్లు అయ్యిందిట‌. ఇదేగాక చెన్న‌య్ లో ప‌లు చోట్ల అపార్ట్ మెంట్లు ఉన్నాయి. రూ.5 కోట్లు పైగా విలువైన ఖ‌రీదైన కార్లు ఆయ‌న సొంతం. రేంజ్ రోవ‌ర్, ఆడి ఆర్ 8, హ‌మ్మ‌ర్ హెచ్ 3, లిమౌసైన్,  ఇంకా బెంగ‌ళూరు స‌హా ప‌లుచోట్ల ఆస్తులు ఉన్నాయి. ముంబైలోనూ కుమార్తెకు సొంత ఇల్లు ఉంది. అలాగే  నీలం క‌రై అనే ఇల్లు ఖ‌రీదు 75 కోట్లుగా ఉంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం పొల్లాచీలో `తెవ‌ర్‌మ‌గ‌న్‌` అనే ఇంట్లో భార‌తీయుడు 2 షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌లే ఉల‌గ‌నాయ‌గ‌న్ ఆ ఇంటి పరిస‌రాల్లో క‌నిపించారు. ఈ పురాత‌న‌మైన డిజైన్ చూడ‌గానే.. భార‌తీయుడు- 1 మండువా ఇల్లు ఇదేనా? అన్న సందేహం క‌లుగుతోంది. ఇక పొల్లాచీ అనేది రెగ్యుల‌ర్ గా వినిపించే పేరు. సౌత్ సినిమాల షూటింగుల‌న్నీ ఇక్క‌డే జ‌రుగుతుంటాయి. శంక‌ర్ - క‌మ‌ల్ హాస‌న్ బృందం భారతీయుడు 2 చిత్రాన్ని వేగంగానే పూర్తి చేయ‌నుంద‌ని ఈ స్పీడ్ చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. అన్న‌ట్టు ఈ సినిమాకి క‌మ‌ల్ హాస‌న్ భారీగానే పారితోషికం అందుకుంటున్నార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు మ‌క్క‌ల్ నీది మ‌య్యం పేరుతో రాజ‌కీయ పార్టీని స్థాపించి రాజ‌కీయాల్లో స్పీడ్  గానే ఉన్నారాయ‌న‌.


Full View

Tags:    

Similar News