బాలీవుడ్ బిగ్గీ చేతికి డియ‌ర్ కామ్రేడ్!

Update: 2019-07-23 16:57 GMT
రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన `డియ‌ర్ కామ్రేడ్‌` తొలి సారి నాలుగు భాష‌ల్లో రీలీజ్ చేస్తున్నవిష‌యం తెలిసిందే. ఈ నెల 26న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో సౌత్ ఇండ‌యా మొత్తం త‌న మార్కెట్ ని విస్త‌రించాల‌ని విజ‌య్ ప్లాన్ చేసుకున్నాడు. అందుకే ఈ మూవీకి త‌న మేన‌మామ య‌ష్ రంగీనేనిని కూడా వ‌న్ ఆఫ్ ద పార్ట్ న‌ర్‌ ని చేశాడు. ప్ర‌చారాన్ని కూడా విభిన్నంగా ప్లాన్ చేశాడు. నాలుగు రాష్ట్రాల్లో డియ‌ర్ కామ్రేడ్‌ మ్యూజిక్ ఫెస్లివ‌ల్ పేరుతో హంగామా చేశాడు. మామూలు రెస్పాన్స్ రాలేదు. విజ‌య్ క్రేజ్‌ కి త‌గ్గ‌ట్లే ఈ సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జ‌రిగింది.

విజ‌య్ క్రేజ్‌ ని - సినిమా వ‌చ్చిన తీరుని గ‌మ‌నించిన బాలీవుడ్ మేక‌ర్స్ `డియ‌న్ కామ్రేడ్‌` హిందీ రీమేక్ రైట్స్ కోసం మైత్రీ మూవీస్‌ ని - బిగ్ బెన్ సినిమాస్‌ ని భారీ స్థాయిలో సంప్ర‌దించార‌ట‌. అయితే ఓ భారీ నిర్మాణ సంస్థ‌కు మాత్ర‌మే రీమేక్ రైట్స్ ఇవ్వాల‌నుకున్న చిత్ర వ‌ర్గాలు చివ‌రికి క‌ర‌ణ్ జోహార్‌కి అప్ప‌గించేశారు. `బాహుబ‌లి` చిత్రానికి యూనివ‌ర్స‌ల్‌ గా మార్కెట్ జ‌రిగిందంటే దానికి ప్ర‌ధాన కార‌కుడు క‌ర‌ణ్ జోహార్‌. అలాంటి నిర్మాత చేతికి `డియ‌ర్ కామ్రేడ్‌` రీమేక్ హ‌క్కుల్ని సినిమా రిలీజ్‌కు ముందే అమ్మేయ‌డంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. సినిమా చూసిన క‌ర‌ణ్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించేసి ఫ్యాన్సీ ఆఫ‌ర్‌ ని ఇచ్చిన‌ట్లు తెలిసింది.

విడుద‌ల‌కు ముందే క్రేజీ ప్రొడ్యూస‌ర్ రీమేక్ చేయ‌డానికి హ‌క్కుల్ని ఫ్యాన్సీ ఆఫ‌ర్‌కు తీసుకోవ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఇక ఈ చిత్ర హిందీ రీమేక్‌ లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే న‌టిస్తాడా? లేక మ‌రొక హీరోకు క‌ర‌ణ్ జోహార్ ఛాన్స్ ఇస్తాడా? అన్న‌ది తెలియాల్సి వుంది. గ‌తంలో కాఫీ విత్ క‌ర‌ణ్ షోలో జాన్వీ క‌పూర్ అవ‌కాశం వ‌స్తే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి న‌టిస్తాన‌ని చెప్పింది. ఆ త‌రువాతవ విజ‌య్‌ని క‌ర‌ణ్ జోహార్ బాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ దానికి సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు ప‌డ‌లేదు. `డియ‌ర్ కామ్రేడ్‌` హిందీ రీమేక్ హ‌క్కుల్ని క‌ర‌ణ్‌ జోహ‌ర్ సొంతం చేసుకోవ‌డంతో మ‌ళ్లీ ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. అది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే క‌ర‌ణ్ జోహార్ వెల్ల‌డించే వ‌ర‌కు వేచి చూడాల్సిందే.   
Tags:    

Similar News