ధైనందిన జీవితంలో సోషల్ మీడియా ప్రాధాన్యత తెలిసిందే. సెలబ్రిటీ ప్రపంచం ఇన్ స్టా- ట్విట్టర్ చుట్టూనే తిరుగుతోంది. దేనికి ప్రచారం కావాలన్నా ముందుగా సోషల్ మీడియానే వేదికగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. సినీ ఇండస్ట్రీ యావత్తూ ఇందులోనే మునిగి తేలుతోంది. వర్ధమాన నటీనటులైతే సొంత వెబ్ సైట్ లు.. అధికారిక సోషల్ మీడియా ఖాతాలు ఏర్పాటు చేసుకుని తమకు సంబంధించిన అన్ని విషయాల్ని పంచుకుంటున్నారు. వ్యక్తిగత వృత్తిగత విషయాల్ని అభిమానులతో షేర్ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఈ వేదికపై భారీ ఆదాయాన్ని కాదనుకోలేక తప్పనిసరిగా అందరూ సోషల్ మీడియాల్లో చేరుతుండడం ట్రెండ్ గా మారింది.
సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో అనేక కాంట్రవర్సీ కామెంట్లతో చెలరేగడం చూస్తున్నదే. అమితాబ్ బచ్చన్ లాంటి వెటరన్ సూపర్ స్టార్.. అలాగే నేటితరం స్టార్లు అంతా ఇన్ స్టా- ట్విట్టర్ లో ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సైతం ట్విట్టర్ లో చాలా చురుగ్గా ఉంటారు. ఇదంతా ఒక ఎత్తయితే హీరోయిన్లు మాత్రం ఇన్ స్ట్రాగామ్ లో తమ అందాలను యథేచ్ఛగా ఆరబోస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాను ఎంచక్కా అందరూ వినియోగించుకుంటుంటే బాలీవుడ్ అందాల చందమామ కరీనా కపూర్ ఖాన్ మాత్రం ఇంత వరకు ఇన్‌స్ట్రాగామ్ లో ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. ఇప్పటికి మనసు మార్చుకుని ఇటొచ్చిందట. అయితే ఉన్నట్టుండి బెబో ఇలా ఇన్ స్టాలో ఎందుకు ప్రవేశించింది? అంటే.. దానికి కారణం లేకపోలేదు.
సోషల్ మీడియా ప్రచారం అంటేనే మనీ గేమ్. అక్కడ వాణిజ్య ప్రకటనల్ని జోరుగా వైరల్ చేస్తూ నాలుగు చేతులా ఆర్జిస్తున్నారు. ఓవైపు సినిమాలతో ఆదాయం.. మరో వైపు ప్రకటనలతో ఆదాయం రెండిటినీ వదులుకునేందుకు సెలబ్రిటీలు ఏమాత్రం సిద్ధంగా లేరు. సైజ్ జీరో దేవత కరీనా ఇన్నాళ్లకు కరుణించింది అంటే దాని వెనక బోలెడంత మనీ గేమ్ ఉందనే భావించాల్సి ఉంటుంది. ఇన్ స్టా మనీ కోసం స్టార్ హీరోయిన్లు అంతా రెడీ అయిపోతున్నారు. ట్వీట్లకు .. ఫోటో షేరింగ్ కి .. యాడ్ షేరింగుకి రెవెన్యూ భారీగా ఉంటోంది కాబట్టి దానిని వదులుకోవడం ఇష్టం లేకే ఈ వేదికపైకి వస్తున్నారు. సోషల్ మీడియా ప్రమోషన్స్ కి కార్పొరెట్ భారీగా డబ్బులు ఇస్తోంది. అప్పనంగా వచ్చేది వదులుకోవడం ఎందుకనే ఇప్పుడు కరీనా కూడా ఈ వేదికపైకి వచ్చిందని అర్థమవుతోంది. కరీనా రీసెంట్ గానే ప్రఖ్యాత ప్యూమా బ్రాండ్ కి సంతకం చేసింది. ఇకపై సోషల్ మీడియాలో ప్రచారం దంచేస్తుందనడంలో ఎలాంటి డౌట్ లేదు.