తెలుగులో వచ్చిన గొప్ప ప్రేమకథా చిత్రాల్లో ‘తొలి ప్రేమ’ ఒకటి. కొత్త దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం అప్పట్లో ట్రెండ్ సెట్టర్ అయింది. ఆ సినిమాలో ఒక్కో సీన్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు ఇప్పటికీ. ముఖ్యంగా అందులో హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథానాయిక పరిచయ దృశ్యం గురించి మాట్లాడినపుడల్లా ఈ సీన్ గుర్తుకొస్తుంది. టాలీవుడ్ బెస్ట్ ఇంట్రో సీన్లలో దీన్ని ఒకటిగా చెప్పొచ్చు.
ఈ సీన్ తాను నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో రాసుకున్నట్లుగా దర్శకుడు కరుణాకరన్ చెప్పడం విశేషం. తాను చెన్నైలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నపుడు ఒకసారి దీపావళి పండక్కి ఊరికి వెళ్లాలనుకున్నానని.. రాత్రి చెన్నై నుంచి బయల్దేరి తెల్లవారుజామున తన గ్రామానికి చేరుకున్నానని.. ఆ సమయంలో తెల్లవారుజామున ఐదు గంటలకు ఒక అమ్మాయి చిచ్చుబుడ్డి వెలిగిస్తూ కనిపించిందని.. ఆమెను ఆ వెలుతురులోనే చూశానని.. ఆ దృశ్యం తన మనసులో ముద్రించుకుపోయిందని కరుణాకరన్ వెల్లడించాడు. ‘తొలి ప్రేమ’ సినిమా టైంలో ఆ సంఘటనను గుర్తు చేసుకుని ఆ స్ఫూర్తితోనే హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ తీశానని కరుణాకరన్ చెప్పాడు.
ఇది మాత్రమే కాదని.. తన సినిమాల్లో చాలా సన్నివేశాలకు నిజ జీవిత ఘటనలు స్ఫూర్తిగా నిలుస్తుంటాయని.. ఇప్పుడు కూడా ఇంటర్ చదువుతున్న తన పిల్లలతో మాట్లాడుతూ ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి.. ప్రేమకథలు ఎలా నడుస్తాయో తెలుసుకుంటూ ఉంటానని కరుణాకరన్ చెప్పడం విశేషం. మరి కరుణాకరన్ కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ ఈ తరం యువత ఆలోచనలకు ఏమాత్రం అద్దం పడుతుందో చూడాలి.