ఎన్టీఆర్ జీవిత చరిత్రపై బయోపిక్ తీయబోతున్నట్లు ఓ పక్క వర్మ స్టేట్ మెంట్.....తేజ దర్శకత్వంలో అన్నగారి జీవిత చరిత్రను తెరకెక్కించబోతున్నట్లు బాలయ్య బాబు స్టేట్ మెంట్....ఈ రెండు బయోపిక్ లు హాట్ టాపిక్ గా మారిన తరుణంలో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి షాకింగ్ ఎంట్రీ ఇచ్చారు. తాను కూడా ఎన్టీఆర్ పై బయోపిక్ `లక్ష్మీస్ వీరగ్రంథం` తీయబోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ఆ తర్వాత లక్ష్మీ పార్వతికి - కేతిరెడ్డికి మధ్య కోల్డ్ వార్ నడవడం....ఆ చిత్ర షూటింగ్ కు అవాంతరాలు రావడం....తనను లక్ష్మీపార్వతి మనుషులు బెదిరిస్తున్నారని ఆరోపించడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. కొద్ది రోజులుగా చడీ చప్పుడు లేకుండా ఉన్న కేతిరెడ్డి ...ఈ సారి తన విమర్శనాస్త్రాలను ప్రముఖ బాలీవుడ్ నటి విద్యా బాలన్ పై సంధించారు. విద్యా బాలన్ పై కేతి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తెరకెక్కబోతోన్న ఓ వెబ్ సిరీస్ లేదా సినిమాలో .....మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో విద్యాబాలన్ నటించబోతోందని, ఆ పాత్రకు ఆమె సరికాదని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ చిత్ర నిర్మాతలు - విద్యా బాలన్ ను ఎంచుకునేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని వార్నింగ్ ఇస్తూతన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు.
బాలీవుడ్ కు చెందిన రాయ్ కపూర్ ప్రొడక్షన్స్ సంస్థ.......'ఇందిర: ఇండియాస్ పవర్ ఫుల్ ప్రైమ్ మినిస్టర్' పేరుతో ప్రముఖ రచయిత్రి సాగరికా ఘోష్ రాసిన నవల కాపీ రైట్స్ ను సొంతం చేసుకుంది. త్వరలోనే ఆ పుస్తకంలోని విషయాలను వెబ్ సిరీస్ లేదా సినిమాలా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆ సాగరికా ఘోష్ - విద్యాబాలన్ లు ట్విట్టర్ ద్వారా కన్ ఫర్మ్ చేశారు. అయితే, ఇందిర వంటి డైనమిక్ లీడర్ పాత్రలో `డర్టీ పిక్చర్` లో కుర్రకారును ఉర్రూతలూగించిన విద్యా బాలన్ ను ఎంచుకోవడంపై కేతిరెడ్డి మండిపడ్డారు. ఈ వ్యవహారంపై ఇందిరా గాంధి ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని, ఆ ప్రాజెక్ట్ నుంచి విద్యా తప్పుకోవాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో....తీవ్రపరిణామాలను విద్యాబాలన్ చవిచూడాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. దేశంకోసం ప్రాణ త్యాగం చేసిన ఇందిర వంటి గొప్ప మహిళానేత పాత్రలో విద్యా బాలన్ ను ఊహించుకోలేమన్నారు. ప్రధాని మోదీ పాత్రలో శక్తి కపూర్ నటించడనాన్ని సహించలేమని...అలాగే ఇందిర పాత్రలో విద్యా నటించడం కూడా సరికాదన్నారు. కళాకారులు ఏ పాత్రలో అయినా నటించవచ్చని....అయితే, వారి గత పాత్రల ప్రభావం భవిష్యత్తులో నటించే సినిమాలపై తప్పక ఉంటుందన్నారు. తమ డిమాండ్ ను ఆ చిత్ర నిర్మాత లు పెడ చెవిన పెట్టకుండా ఆమెను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పించాలన్నారు.