బాహుబలి తప్పుకో.. ఖైదీ నెం 150 వచ్చాడు

Update: 2017-01-12 10:49 GMT
అనుకున్నట్లే జరిగింది. రీమేక్ తో వస్తున్నాడని రామ్ గోపాల్ వర్మ వంటి ఘనులు తిట్టిపోసినా కూడా.. తెలుగు ఆడియన్స్ మాత్రం మెగాస్టార్ చిరంజీవిపై తమకున్న అశేష అభిమానాన్ని మరోసారి నిరూపించారు. వారికి చిరంజీవిని స్ర్కీన్ పై చూడటమే ఆనందం అని ప్రూవ్ చేశారు. అంతేకాదు.. తెలుగు రాష్ట్రంలలో మెగాస్టార్ పై చూపించిన అభిమానం.. ఆయన్ను టాప్ చార్ట్స్ లోకి కూడా తెచ్చేసింది.

రావడం రావడమే నెం.1 పొజిషన్లోకి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు తెలుగు రాష్ట్రంలలో అత్యధికంగా తొలిరోజున వసూలైన షేర రికార్డు బాహుబలి పేరును ఉంది. తొలిరోజు ఈ సినిమా 22.4 కోట్ల షేర్ ను వసూలు చేసి.. తెలుగు సినిమా స్థాయిని కొత్త లెవెల్ కు తీసుకెళ్ళింది. అయితే అప్పట్లో సర్దార్ గబ్బర్ సింగ్ ఈ తొలిరోజు రికార్డును కొట్టేస్తాడని అనుకుంటే.. ఆ సినిమా మాత్రం.. 20.92 కోట్ల దగ్గరే ఆగిపోయింది. ఇక ''ఖైదీ నెం 150'' మాత్రం అనూహ్యంగా ఏకంగా 23.24 కోట్లు షేర్ వసూలు చేసేసి.. నెం.1 స్థానంలోకి వచ్చేసింది.

ఇంకా సంక్రాంతి సెలవలు రావడానికి రెండు రోజుల ముందే ఖైదీ ఇలా రెచ్చిపోతే అసలు హాలిడే రోజున సినిమా రిలీజ్ అయ్యుంటే కలక్షన్లు ఇంకా అదిరిపోయాయ్ అని పబ్లిక్ ఒపీనియన్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News