'కింగ్' అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ''వైల్డ్ డాగ్''. వాస్తవ సంఘటన ఆధారంగా అహిషోర్ సాల్మోన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి - అన్వేష్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే విడుదలైన ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంది. యూట్యూబ్ లో విడుదలైన కొన్ని రోజుల్లోనే 11 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. ఈ క్రమంలో 'వైల్డ్ డాగ్' టీమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ మేకర్స్ ఓ వీడియో వదిలారు.
నాగార్జున ఇందులో ఏసీపీ విజయ్ వర్మ అలియాస్ వైల్డ్ డాగ్ అనే ఎన్ఐఏ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. సయామీ కేర్ - అతుల్ కులకర్ణి - ఆలీ రెజా - ప్రకాష్ సుదర్శన్ - బిలాల్ హుస్సేన్ వైల్డ్ డాగ్ టీమ్ లో సభ్యులుగా నటించారు. దేశం కోసం ప్రాణాలైన వదిలేయడానికే రెడీగా ఉండే పాత్రల్లో వీరు కనిపిస్తున్నట్టు నాగ్ వెల్లడించారు. ఇందులో కనిపించే యాక్షన్ సీన్స్ అన్ని రియల్ గా జరిగినట్లు చూపించడానికి ఎక్స్పర్ట్స్ చేత ఆ సీక్వెన్సెస్ డిజైన్ చేయించాం. నిజంగా మన కళ్ళ ముందు జరుగుతోందా అనిపించేలా చేస్తుంది అని చెప్పుకొచ్చారు.
ఇకపోతే హైదరాబాద్ లో 2007లో జరిగిన గోకుల్ చాట్ బాంబ్ బ్లాస్ట్ మరియు 2013 దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల వెనుకున్న ప్రధాన సూత్రధారులను పట్టుకోడానికి రంగంలోకి దిగిన ఎన్ఐఏ టీమ్ కథను ఈ చిత్రంలో చూపించబోతున్నారు. ఈ చిత్రానికి థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చగా.. షానెల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ వర్క్ చేశారు. డేవిడ్ యాక్షన్ డైరెక్టర్ గా.. మురళి ఎస్వీ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు.