శింబు అలియాస్ శిలాంబరసన్ కెరీర్ లో వివాదాల గురించి తెలిసిందే. కథానాయికలతో ఎఫైర్లు మొదలు తన దర్శకనిర్మాతలతోనూ అతడికి వివాదాలున్నాయి. అందుకే అతడు గొప్ప స్టార్ గా ఓ వెలుగు వెలిగి ప్రతిభావంతుడు అని నిరూపించుకుని కూడా ఇటీవల పూర్తిగా రేసులో వెనకబడ్డాడు. ఇటీవల పలువురు నిర్మాతలు సాంకేతిక నిపుణులతో అతని గొడవ చివరికి తమిళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ నుండి రెడ్ కార్డ్ నిషేధానికి దారితీసింది. ఎట్టకేలకు ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కూడా ఇప్పుడు శింబు తదుపరి చిత్రాల షూటింగ్ లకు సహకరిస్తుంది. ఇటీవల జరిగిన సమావేశంలో శింబు -TFPC ల మధ్య సమస్యలు పరిష్కరించబడ్డాయని ప్రకటించారు.
శింబు ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో రెండు సినిమాల షూటింగ్ లకు రెడీ అవుతున్నారు. వారు గౌతమ్ మీనన్ `వెందు తానింధుడు కాదు` .. గోకుల్ తో `కరోనా కుమార్` చిత్రాల్ని చేస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ `మానాడు` షూటింగ్ ను శింబు ఇటీవలే పూర్తి చేశాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అతను త్వరలో ముఫ్తీకి అధికారిక రీమేక్ అయిన పాథూ తాలా షూటింగ్ ప్రారంభిస్తాడు. ఇంతలోనే రెడ్ కార్డ్ నిషేధం ఎత్తివేత వార్త విని శింబు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. శింబు సినిమాలన్నీ ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా వేగంగా చిత్రీకరణలు పూర్తి చేసుకుని రిలీజవుతాయని అంతా ఆశిస్తున్నారు.
లవ్ స్టోరీలు పెద్ద దెబ్బ కొట్టాయి
శింబు కెరీర్ ఆరంభమే అందాల నయనతారతో ఎఫైర్ సాగించాడు. అప్పట్లో ఈ జంట పెళ్లి వరకూ వెళ్లినా కానీ అది కాలేదు. ఆ తర్వాత నయన్ ప్రభుదేవాతో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇక శింబుకి పలువురు తమిళ నాయికలతో ఎఫైర్లు ఉన్నాయని ప్రచారమైంది. ఈ జాబితాలో త్రిష.. అమలాపాల్ పేర్లు వినిపించాయి. చివరిగా శింబు యాపిల్ బ్యూటీ హన్సికతోనూ ఎఫైర్ సాగించి నిరంతరం వార్తల్లో నిలిచారు. కానీ ఈ జోడీ కూడా విడిపోయింది. అనంతర కాలంలో వేరొక యువనాయికతో శింబు ప్రేమలో పడ్డాడని ఈసారి పెళ్లితో ఓ ఇంటివాడవుతాడని కూడా తామరతంపరగా ప్రచారం సాగిపోయింది. కానీ ఇవేవీ నిజాలు కాలేదు. శింబు వాలకం చూస్తుంటే అతడు కూడా పెళ్లికి పూర్తిగా వ్యతిరేకి అని అంగీకరించాల్సిన సన్నివేశం కనిపిస్తోంది. ప్రముఖ వెటరన్ నటుడు.. దర్శకనిర్మాత టి.రాజేందర్ వారసుడిగా అతడు అత్యున్నత శిఖరాన్ని తాకాల్సి ఉన్నా వృత్తిగత వ్యక్తిగత వ్యవహారాల్లో బిగ్ ఫెయిల్యూర్ ని ఎదుర్కొంటున్నాడన్న విమర్శ మచ్చ అలా ఉండిపోయాయి. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్.. కోలీవుడ్ లో శింబు.. టాలీవుడ్ లో ప్రభాస్ ఒకే జానర్ లో ఉన్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మన డార్లింగ్ ప్రభాస్ మాత్రం కాస్త డీసెంట్ బోయ్ గా హార్డ్ వర్కర్ గా కెరీర్ పరంగా రాజీకి రాకుండా దూసుకుపోతున్నాడు.