ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేసే మహేష్ అనే యువకుడు పోలీస్ స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది.
అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ స్టేషన్ ఎదుట ఈ ఘటన చోటుచేసుకుంది. మడకశిర మండలం చీపులేటి గ్రామానికి చెందిన మహేష్.. డైరెక్టర్ కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా పనిచేస్తున్నాడు.
మహేష్ తన అన్నను సెప్టెంబర్ 8న పోలీసులు అరెస్ట్ చేశారు. తన అన్న కర్ణాటక నుంచి మద్యం అక్రమంగా తీసుకొచ్చి అమ్ముతున్నాడని.. పోలీసులు ఇంటికి వచ్చి విచక్షణారహితంగా ప్రవర్తించారని పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగాడు.
ఈ ఘటనతో తన పెళ్లి ఆగిపోయిందని మహేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. పోలీసులే తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. అక్కడే వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని నిప్పటించుకునే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు వెంటనే తేరుకొని మహేష్ ఆత్మహత్యాయత్నం చేయడాన్ని అడ్డుకున్నారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.