మహేష్ బాబు హీరోగా.. గతంలో ఆయనకు శ్రీమంతుడు సినిమాతో మైండ్ బ్లోయింగ్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్లో ''భరత్ అను నేను'' అంటూ ఒక పాలిటికల్ మెసేజ్ ఓరియెంటడ్ సినిమా రాబోతోంది. ఈ సినిమా నిజానికి సంక్రాంతికే రావల్సి ఉన్నా కూడా.. ఇప్పుడు మాత్రం ఏప్రియల్ 27 అంటూ సమ్మర్ కానుకగా రెడీ చేస్తున్నారు.
ఇక 2 పాయింట్ ఓ సినిమా కూడా అదే తేదీన రావడంతో.. నిర్మాత డివివి దానయ్య అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కాని మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా విషయంలో కొరటాల శివకు కూడా ఒక అసంతృప్తి ఉందట. తాము ప్రచారం చేయకపోయినా కూడా.. ఇదే టైటిల్ అని చెప్పకపోయినా కూడా.. ఆల్రెడీ భరత్ అను నేను అనే టైటిల్ బాగా పాపులర్ అయిపోయింది. అంతే కాకుండా.. నా పేరు సూర్య సినిమాతో రేసులోకి దూకుతూ ఒక వివాదం.. ఇప్పుడు కొత్తగా రోబో 2 మేకర్లతో కూడా క్లాష్.. ఇవన్నీ కొరటాలకు నచ్చలేదట. అందుకే సినిమాకు మరొక టైటిల్ పెడదాం అని సెలవిచ్చాడట.
భరత్ అను నేను కేవలం ఒక వర్కింగ్ టైటిల్ అని చెబుతూ.. సినిమాకు ఇప్పుడు మరో టైటిల్ ను ఇస్తారట. అయితే గతంలో ఏజెంట్ శివ అనే సినిమా టైటిల్ ను స్పైడర్ అని మార్చి మహేష్ పెద్ద తప్పే చేశాడు. నిజానికి సినిమా పేరు స్పైడర్ అని చెప్పకపోయుంటే.. సినిమాపై అంచనాలు మరోలా ఉండి.. రిజల్ట్ కూడా వేరేగా ఉండేది. అందుకే ఇప్పుడు కొరటాల చెప్పిన పేరు మార్పిడి పథకానికి పచ్చ జెండా ఊపాలా వద్దా అని మహేష్ చూస్తున్నాడట.