వీళ్ల వాలకం చూస్తుంటే బిగ్ బాస్ కే టెన్షన్ పట్టుకునేట్టుంది! ఒక ఇంటి సెట్ నిర్మించి బుల్లితెర రియాలిటీ షో పేరుతో కొందరు కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపి వంద రోజుల పాటు ఆడుకునే ఆటతోనే బోలెడంత వినోదం పంచుతుంటే.. వేరొక రియాలిటీ షోలో అంతకు మించి ప్లానింగ్ నడుస్తోంది. ఆ ఆటే డిఫరెంట్. అడవులు.. సాహసం... ధైర్యం.. థ్రిల్ అంటూ ఏకంగా థాయ్ ల్యాండ్ అడవుల్లోకి వెళ్లిపోతున్నారట కంటెస్టెంట్స్. అక్కడ ఓ కొత్త తరహా రియాలిటీ షోని ప్లాన్ చేశారు. కొందరు సాహసికులు ఇక్కడ డేర్ డెవిల్ యాక్ట్ తో కళ్లు తిప్పుకోనివ్వరట. మొత్తం ఈ రియాలిటీ షోలో 10 ఛాలెంజెస్ ని నెగ్గాల్సి ఉంటుంది. ఈ రియాలిటీ షోకి `హీరోస్` అంటూ టైటిల్ పెట్టడంతో నిజంగానే హీరోయిజం బయట పెట్టేట్టే కనిపిస్తోంది.
ఇంతకీ ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎవరు? హోస్ట్ ఎవరు? అంటే.. తెలుసుకునేందుకు చాలానే ఉంది. ఈ రియాలిటీ షోకి లక్ష్మీ మంచు హోస్ట్. పది మంది టాప్ సెలబ్రిటీల్ని ఈ షోకి ఎంపిక చేశారు. గాయకుడు అనుదీప్- అత్తారింట్లో అక్క చెల్లెలు లీడ్ నటుడు ఆకర్ష్, రోడీస్ కంటెస్టెంట్ మిలింద్ చాంద్వానీ- జబర్థస్త్ ఫేం రామ్ ప్రసాద్- కమెడియన్ విద్యుల్లేఖ- నటి అపూర్వ శ్రీనివాసన్- ముద్ద మందారం ఫేం సునంద మాల శెట్టి- మిస్ ఇండియా ఏపీ శ్రిష్ఠి వ్యాకరణం పార్టిసిపెంట్స్. వీళ్లతో పాటే బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్స్ సమ్రాట్, తేజస్వి మదివాడ జాయిన్ అవుతున్నారు.
మొత్తానికి స్టార్-మా `బిగ్ బాస్` ని కొట్టే ప్లాన్ లోనే జీ చానెల్ `హీరోస్` ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. రొటీన్ గా ఇంట్లో ఉండి డ్రామాలాడడం.. కామెడీలు చేయడం.. డ్యాన్సులాడడం.. తిట్టుకుని కొట్టుకుని గొడవలాడుకోవడం.. వీటన్నిటివల్లా పుట్టే ఎమోషన్ కంటే మనుషులు దూరని కారడివిలో సాహసాలతో టెన్షన్ పెడుతుంటే పుట్టే ఎమోషన్ కాస్త పెద్ద రేంజులోనే ఉంటుందేమో!! మరి ఈ షో ఎంతవరకూ సక్సెసవుతుంది? అన్నది చూడాలి.