ప్రేమమ్‌ బ్యూటీ పాట్లు.. ఈసారి సరికొత్తగా

Update: 2022-03-10 06:48 GMT
మలయాళ సినిమా ప్రేమమ్‌ తో సౌత్‌ ఇండియా మొత్తం ఫేమస్ అయిన అనుపమ పరమేశ్వరన్‌ ఆ తర్వాత తెలుగు తమిళ సినిమాల్లో కూడా ఆఫర్లు దక్కించుకుంది. తెలుగు లో ఈమె మొదటగా చేసిన రెండు సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత నుండి ఈమె కు బ్యాడ్‌ టైమ్‌ స్టార్ట్‌ అయినట్లుగా అనిపిస్తోంది. ఈమె చేసిన సినిమాలు నిరాశ పర్చనా.. సక్సెస్ అయినా పెద్దగా ఆమె కెరీర్‌ టర్న్‌ అయిన దాఖలాలు కనిపించడం లేదు.

అనుపమ పరమేశ్వరన్ కు నటిగా మంచి గుర్తింపు దక్కింది. అందాల ఆరబోత విషయంలో ఆమె ను అభిమానులు ఆధరిస్తూనే ఉన్నారు. కాని ఫిల్మ్‌ మేకర్స్ మాత్రం ఆమెను లైట్‌ తీసుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. స్టార్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఆమెను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే సమయంలో చిన్న సినిమాల్లో వచ్చిన ఆఫర్‌ ను సద్వినియోగం చేసుకుంటుంది. నటిగా తనను తాను పలు సందర్బాల్లో నిరూపించుకున్న ఈ మలయాళి ముద్దుగుమ్మ కొత్తగా నిరూపించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు బటర్ ఫ్లై అనే సినిమా ను చేస్తోంది. ఆ సినిమా లో భూమిక కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నెట్టింట ఈ సినిమాకు సంబంధించిన హడావుడి కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరన్‌ పుట్టిన రోజు సందర్బంగా సినిమా ఫస్ట్‌ లుక్ ను విడుదల చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించి సినిమా ఖచ్చితంగా పాజిటివ్‌ రెస్పాన్స్ దక్కించుకుంటుందనే ఒక అభిప్రాయం కలిగేలా చేశారు.

తాజాగా సినిమా నుండి ఒక పాటను విడుదల చేశారు. ఉమెన్స్ డే సందర్బంగా విడుదల అయిన ఈ పాట ను అనుపమ పరమేశ్వరన్ పాడటం తో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటి వరకు సినిమాల్లో సిరీస్ లో షార్ట్‌ ఫిల్మ్‌ లో కనిపించి సందడి చేసిన ఈ అమ్మడు ఈసారి ఇలా పాట పాడి తన గొంతుతో ఆకట్టుకుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పాట కు రిలిర్స్ ను అనంత శ్రీరామ్‌ అందజేశాడు.

వీడియో సాంగ్‌ లో అనుపమ తన డాన్స్ తో కూడా అదరగొట్టింది. ఆల్‌ ది లేడీస్ అంటూ సాగే ఈ పాట సినిమా పై ఆసక్తి పెంచుతుందంటూ కామెంట్స్ వస్తున్నాయి. అనుపమ ఈ సినిమా కోసం చాలా కష్టపడుతోంది. సక్సెస్ కోసం ఈ అమ్మడు చేస్తున్న ప్రయత్నాలు ఈసారి అయినా సఫలం అవుతాయా.. స్టార్‌ హీరోల దృష్టిలో ఈ అమ్మడు పడుతుందా అనేది చూడాలి.


Full View

Tags:    

Similar News