టాలీవుడ్ లో ఇటీవల కాలంలో రీమేక్ సినిమాల సందడి కొనసాగుతోంది. కుర్ర హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అందరూ ఇతర భాషల్లో హిట్టయిన చిత్రాల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి - పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్స్ సైతం వరుస రీమేక్స్ లైన్ లో పెడుతున్నారు. అయితే ఈ విషయంలో ఓవర్గం ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరుత్సాహానికి గురవుతున్నారని తెలుస్తోంది.
చిరంజీవి 'ఖైదీ నెం.150' చిత్రంతో మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇది తమిళ్ బ్లాక్ బస్టర్ 'కత్తి' కి రీమేక్. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో దూసుకుపోతున్న చిరు.. రెండు రీమేక్స్ చేస్తున్నారు. మలయాళ 'లూసిఫర్' చిత్రానికి రీమేక్ గా 'గాడ్ ఫాదర్' - తమిళ సినిమా 'వేదాళమ్' రీమేక్ గా 'భోళా శంకర్' మూవీ తెరకెక్కుతోంది.
మరోవైపు, ఇప్పటికే అనేక రీమేక్ చిత్రాల్లో నటించిన పవన్ కళ్యాణ్.. హిందీ 'పింక్' రీమేక్ గా రూపొందిన 'వకీల్ సాబ్' సినిమాతో కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు లేటెస్టుగా థియేటర్లలోకి వచ్చిన 'భీమ్లా నాయక్' సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్. ఇదే క్రమంలో మరో రీమేక్ మూవీ చేయడానికి పవన్ రెడీ అవుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఇలా చిరంజీవి - పవన్ కళ్యాణ్ లైనప్ చూస్తుంటే, ఒరిగినల్ స్క్రిప్టుల కంటే ఎక్కువగా అరువు తెచ్చుకున్న సబ్జెక్ట్ లనే నమ్ముకున్నట్లు అర్థం అవుతుంది. సరైన స్క్రిప్ట్‌లు రాకపోవడంతో ఇలాంటివి ఎంచుకుంటున్నారా లేదా ఆల్రెడీ హిట్టయిన సబ్జెక్ట్ అయితే సేఫ్ అని భావిస్తున్నారో తెలియదు కానీ.. మెగా అభిమానులు మాత్రం తమ ఫేవరేట్ హీరోలు ఏదైనా కొత్తగా ప్రయత్నిస్తే చూడాలని కోరుకుంటున్నారు.
ఓటీటీలు హవా పెరిగిపోయిన తర్వాత ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఫ్రెష్ కంటెంట్ ను చూడటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. అలాంటి కంటెంట్ కే యూత్ ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఒరిజినల్స్ - వెబ్ సిరీస్ లకు అలవాటు పడిన జనాలను ఆకర్షించేలా వర్ధమాన ఫిలిం మేకర్స్ సరికొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు.
ఇప్పటికే పలువురు స్టార్ హీరోలు కొత్త రకమైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. చిరంజీవి - పవన్ కళ్యాణ్ లకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నప్పటికీ.. వారు రీమేక్ కథల్లో నటించడానికి ఆసక్తి కనబరుస్తుండటం గమనార్హం. దీని వల్ల ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవడమే కాదు.. ఈతరం ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది
మెగా బ్రదర్స్ రీమేక్ చిత్రాలతో పాటుగా పలు ఒరిజినల్ మూవీస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' సినిమాతో పాటుగా 'భవదీయుడు భగత్ సింగ్' లలో నటిస్తున్నారు. మరోవైపు బాబీ దర్శకత్వంలో చిరంజీవి ఓ మూవీ చేస్తున్నారు. అలానే వెంకీ అట్లూరి మూవీ కూడా మెగాస్టార్ లైనప్ లో ఉంది. మరి ఈ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.