రానా సరసన `లీడర్` చిత్రంతో కథానాయికగా తెరంగేట్రం చేసింది ప్రియా ఆనంద్. ఈ ఎన్నారై గాళ్ కి తెలుగు-తమిళం-హిందీ చిత్రసీమతో చక్కని అనుబంధం ఉంది. అన్ని పరిశ్రమల్లో వరుసగా పలు చిత్రాల్లో నటించింది. అగ్ర కథానాయిక కాలేకపోయినా తనకంటూ అవకాశాలు ఉన్నాయి.
తెలుగులో రానా -రామ్ లాంటి యువహీరోలతో నటించింది. తమిళంలో జై సరసన `వామనన్`లో తొలిసారిగా నటించిన ప్రియా ఆనంద్ ఆ తర్వాత శివకార్తికేయన్- అథర్వ- విక్రమ్ ప్రభు- గౌతమ్ లాంటి హీరోలతో నటించింది. ఇటీవల కార్తీక్- పృథ్వీరాజ్- పునీత్ రాజ్ కుమార్ - అశోక్ సెల్వన్ లాంటి హీరోల సరసనా అవకాశాలు అందుకుంది.
అయితే సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా లేని ప్రియా ఆనంద్ సెలక్టివ్ గానే పోస్టింగులు పెడుతుంటుంది. ఆమె వివాదాస్పద స్వామి నిత్యానందకు సంబంధించిన కోట్ లను నెలకు కనీసం రెండుసార్లు షేర్ చేయడం అభిమానుల కంట పడింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రియాను దీని గురించి ప్రశ్నించగా.. నిత్యానంద అంటే తనకు ఇష్టమని బాహాటంగా సమాధానం ఇచ్చింది.
వేలాదిగా ప్రజలు ఫాలో అవడానికి కారణం తన చరిష్మా ఆకర్షణ అని ప్రియ వివరించింది. అంతే కాదు.. తాను అతనిని పెళ్లి చేసుకుంటానని సరదాగా వ్యాఖ్యానించింది. పెళ్లి తర్వాత తన పేరును కూడా అంతగా మార్చాల్సిన అవసరం లేదు అని జోక్ చేసింది. ఎందుకంటే ఇరువురి పేరులో `నంద` కామన్ గా ఉంది... సారూప్యత కలిగి ఉంది అని వ్యాఖ్యానించింది. ప్రియా ఎంతో యాక్టివ్.. తెలివైనది కూడా. సెట్స్ లో కొంచెం చిలిపిగా ఉంటుంది. కానీ వివాదాస్పద నిత్యానందపై సరదా కామెంట్ పై తన సోషల్ మీడియా ఫాలోవర్స్ లో ఒక వర్గానికి సరదా అనిపించినా కానీ.. ఇతరులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.
ఒక అభిమాని నిత్యానంద గురించి వివరించాడు. స్వామీజీ చాలా నెలలుగా పరారీలో ఉన్నాడు.. అతను తన స్వంత దేశమైన కైలాసాన్ని సృష్టించినట్లు పేర్కొన్నాడు. లైంగిక నేరాలు సహా పెండింగ్ లో ఉన్న అనేక కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల పోలీసులు అతని కోసం వెతుకుతున్న సమయంలో అతను అనారోగ్యంతో ఉన్నాడని కథనాలొస్తున్నాయి.. అని అడిగాడు.
ప్రియా ఆనంద్ తదుపరి చిత్రాలు సుమో-కాసేతన్ కడవులాడా-అంధగన్ (మిర్చి శివ) విడుదలకు రానున్నాయి. అంధగన్ లో ఆమె ప్రముఖ హీరో ప్రశాంత్ సరసన కథానాయికగా నటిస్తోంది. త్యాగరాజన్ దర్శకత్వం వహిస్తున్నారు.