వయస్సు 44 అయినా కూడా.. చూడ్డానికి ఇంకా 32 ఏళ్ళ సీనియర్ హీరోయిన్ టైపులోనే కనిపిస్తుంది 'రోజా' మూవీ ఫేం మధుబాల ఎలియస్ మధు. అయితే ఈవిడ తెలుగులో నదియా తరహాలో పాగావేయాలని భారీ స్కెచ్ వేసుకొచ్చారు కాని.. ఎందుకో అది వర్కవుట్ కాలేదు. ఇంతకీ ఇప్పుడు టాలీవుడ్ ఈవిడ గురించి ఏమంటోంది మరి?
అంతకు ముందు ఆ తరువాత సినిమాతో హీరోయిన్ మథర్ క్యారెక్టర్ లో ఎంట్రీ ఇచ్చింది మధు. ఆ తరువాత పెద్ద రోల్స్ ఏమైనా వస్తాయని అనుకుంటే.. నిఖిల్ మథర్ గా సూర్య వర్సెస్ సూర్య సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాలూ కూడా మోడరేట్ విజయాలే సాధించాయి. దానితో మధు బాలకు ఆఫర్లు కరువైపోయాయ్. నాన్నకు ప్రేమతో సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో ఏదో అలా మెరిసినా.. అంత ప్రాముఖ్యం ఉన్న పాత్ర కాకపోవడంతో అస్సలు జనాలకు కనక్టవ్వలేదు. అందుకే తెలుగులో ఈమెకు ఎవ్వరూ పెద్దగా పిలిచి ఆఫర్లు ఇస్తున్నట్లు అనిపించట్లేదు.
అయితే కన్నడలో మాత్రం తనకు బాగానే ఛాన్సులు వస్తున్నాయి అంటోంది మధు. కాకపోతే ఆమె నదియా తరహాలో మార్కెంటింగ్ మాత్రం చేసుకోవట్లేదట. వస్తే ఆఫర్లు ఓకె.. లేకపోతే లేదు.. అంటోంది అమ్మడు. అందుకే అమ్మ పాత్రలు కూడా మొహం చాటేస్తున్నాయి.