చీకటిరాజ్యం సినిమాలో కమల్ హాసన్ తో లిప్ లాక్ వేసింది మధుశాలిని. ఈ లిప్ లాక్ తో ప్రపంచమంతా పాపులర్ అయిపోయింది. అంతవరకూ లేని పాపులారిటీ ఈ ఒక్క లిప్ లాక్ తో కొట్టేసింది ఈ తెలుగమ్మాయ్! ఇప్పుడు దానికి కొనసాగింపుగా బ్రూస్ లీ సినిమాతో ఇంకాస్త ప్రచారం కొట్టేస్తోంది మధూ. ఈ సినిమాలో చరణ్ సోదరిగా నటించిన కృతి కర్భందాకి డబ్బింగ్ చెప్పింది మధుశాలిని. ఈ వాయిస్ కి ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
టాలీవుడ్ విలన్ రావు రమేష్ ఇప్పటికే మధుశాలిని వాయిస్ చాలా గమ్మత్తయినది. బ్రూస్‌లీ కి అది ప్లస్ అయ్యింది అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు. సేమ్ టైమ్ కృతి కర్భంద సైతం మధుశాలినికి కృతజ్ఞతలు చెబుతూ ఆన్ లైన్ లో బోలెడంత పబ్లిసిటీ చేసింది. ఇదే మొదటిసారి. ఇలా డబ్బింగ్ చెప్పడం చాలా బావుంది. బ్రూస్ లీ చిత్రంతో డబ్బింగు కూడా అధికారికం అయ్యింది.. అంటూ ఆనందం వ్యక్తం చేసింది మధుశాలిని. అయితే ఈ క్రెడిట్ అంతా దర్శకుడు శ్రీనువైట్లకే దక్కాలి. రొటీన్ డబ్బింగ్ ఆర్టిస్టుతో కాకుండా ఇలా మధుశాలినికి పిలిచి అవకాశం ఇవ్వడం అతడి గొప్పతనం. అదే ఇప్పుడు మధూకి కూడా పెద్ద రేంజులో ప్రచారం తెస్తోంది.