మహానటి వసూళ్ళు బాగున్నాయిగా

Update: 2018-05-10 18:20 GMT

వైజయంతి ప్రొడక్షన్ నుంచి వచ్చిన మహానటి సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా అనుకున్నంత స్థాయిలో హిట్ అవుతుందా అని అనేక రకాల కామెంట్స్ వినిపించాయి. కానీ సినిమా మొదటి ఆట నుంచే మంచి రెస్పాన్స్ అందడంతో సోషల్ మీడియా ను ఫాలో అయ్యే వాలు మరో ఆటకే సినిమా కు వెళ్లాలని డిసైడ్ అయిపోయారు.

మొదటి రోజు షేర్స్ పరంగా సినిమా మంచి లెవెల్లోనే కొనసాగింది. ఏపి తెలంగాణాలో 1.5 కోట్ల షేర్స్ తో పెట్టుబడి పెట్టిన దానిలో కొంత రికవర్ అయ్యింది. టాక్ బావుండడంతో వీకెండ్స్ లోపు కలెక్షన్స్ స్థాయి ఇంకా పెరిగే అవకాశం ఉంది. సినిమా మొత్తంగా 11 కోట్ల థ్రియేటికల్ రైట్స్ కు అమ్మడు పోయింది. అన్ని ఏరియల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు చాలా వరకు సినిమా ప్రమోషన్స్ రేంజ్ పెరిగేలా ప్రశంసలను కురిపించారు. మరి వీకెండ్ కి సినిమా ఏ స్థాయిలో షేర్స్ అందుకుంటుందో చూడాలి.

ఏరియల్ వారీగా ఏపి - తెలంగాణాలో షేర్స్ ఈ విధంగా ఉన్నాయి  
నైజం - 0.66Cr
ఉత్తరాంధ్ర - 0.18Cr
సీడెడ్ - 013Cr
గుంటూరు - 0.09Cr
కృష్ణ - 0.15Cr
తూర్పు - 0.10Cr
వెస్ట్ - 0.06Cr
నెల్లూరు - 0.04Cr
ఏపి/తెలంగాణ: 1.41Cr
Tags:    

Similar News