ఆఖరి రోజున సావిత్రిపై పూలేశారు

Update: 2018-03-22 05:12 GMT
సినిమా తీయడం మొదలెట్టిన రోజున ఒక అద్వితీయమైన నటికి ఎలాంటి నివాళి అర్పించారో తెలియదు కాని.. దాదాపు ప్రతీ సినిమావారూ ఆఖరి రోజున మాత్రం కేక కటింగ్ నుండి పటాలకు పూలేయడం వరకు చాలానే చేస్తున్నారు. షూటింగ్ లాస్ట్ డే అనగానే చాలామంది ఇన్నాళ్ళూ కలసి పనిచేసిన టీమ్ ను ఇక వదిలేస్తున్నామే అని ఫీలైపోతుంటారు. అది ఎమోషనల్ కనక్ట్. అలాగే ఉంటుంది. ఇప్పుడు ''మహానటి'' విషయంలో కూడా అదే జరిగింది.

నిన్నటి రోజున మహానటి సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది. అఫీషియల్ గా గుమ్మడికాయ కొట్టేశారు. ఈ సందర్భంగా చాలామంది నటీనటులు కళ్ళమ్మెట నీళ్లు పెట్టుకున్నారట. అలాగే షూటింగ్ స్పాట్ దగ్గర సావిత్రి చిత్రపటం ఒకటి ఉంచి.. ఆమెకు పువ్వులేసి నివాళులు అర్పించారు. ఇన్నాళ్ళూ సావిత్రి బర్త్ డే లేదా సంవత్సరీకం వంటివి ఏవీ జరపని తెలుగు ఫిలిం ఇండస్ర్టీ.. సడన్ గా ఇలా కనీసం ఒక సినిమాకోసం అయినా నివాళులు అర్పిస్తుంటే.. ఆమె అభిమానులు కాసింత ఊరట చెందుతున్నారు. కాని ఇటువంటి మహా నటీనటులను ప్రతీ ఏడాది గుర్తు తెచ్చుకుంటే బాగుంటుంది కదూ.

ఇకపోతే కీర్తి సురేష్‌ మెయిన్ లీడ్లో చేస్తున్న 'మహానటి'లో.. హీరోయిన్ సమంత జర్నలిస్ట్ గా కనిపిస్తోంది. మే 9న ఈ సినిమాను విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసేశారు. ఒక ప్రక్కన భారీ సినిమాల ప్రవాహం బాక్సాఫీస్ ను ఆ సమయానికి ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశం ఉన్నా కూడా.. మనోల్ళు మాత్రం డేటు విషయం తగ్గేదే లేదు అంటున్నారు. అది సంగతి.
Tags:    

Similar News