సూపర్ స్టార్ మహేష్ బాబు రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక గ్రామాన్ని కూడా మహేష్ దత్తత తీసుకున్నాడు. కానీ ఈ దత్తత ఎపిసోడ్ మహేష్ సినిమా రిలీజ్ ల టైంలో బయటకు వచ్చింది. శ్రీమంతుడు విడుదల సమయంలో దత్తత తీసుకుంటాడని న్యూస్ రాగా, ఇప్పుడు బ్రహ్మోత్సవం రిలీజ్ సమయానికి అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాడు. దీంతో ఈ గ్రామాల దత్తత అంతా సినిమా ప్రచారం కోసం అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది.
ఈ వార్తలపై మహేష్ బాబు స్పందించాడు. 'ప్రతీ ఒక్కరి జీవితంలో మార్పు రావాలి. లేకపోతే మనిషి జీవితంలో ఎదగడం చాలా కష్టం. అయితే.. గ్రామాలను దత్తత తీసుకోవడం నా ఆలోచన కాదు. శ్రీమంతుడు నిర్మాణ సమయంలోనే మా బావ గల్లా జయదేవ్ ఈ ఆలోచనతో నా దగ్గరకు వచ్చినపుడు నేను అంగీకరించాను. కానీ ఈ ఎపిసోడ్ ని నా సినిమా పబ్లిసిటీ కోసం ఉపయోగించుకునే ఆలోచన లేకపోవడంతో.. అప్పట్లో అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం పని ప్రారంభించినా ఇది ఆరంభం మాత్రమే. రాబోయే రెండేళ్లలో నేను కోరుకున్న అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా' అన్నాడు మహేష్ బాబు.
ముఖ్యంగా విద్య - వైద్యంపై ఎక్కువగా దృష్టి పెడతానని మహేష్ అంటున్నాడు. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా.. ఈ రెండు రంగాలపై ఎక్కువగా ఫోకస్ చేస్తానని చెప్పాడు. పబ్లిసిటీ కోసం దత్తత అన్న మాటను ఖండించాడు మహేష్.