ఇకపోతే తొలిరోజు వసూళ్ళతోనే 1 మిలియన్ డాలర్ క్లబ్ లోకి దూసుకుపోయిన శ్రీమంతుడు, రెండో రోజు, తొలి సండే, ఇలా మొత్తంగా తొలి వీకెండ్ కు తప్పకుండా ఇరగదీస్తాడు. అదే ఆ సామి సత్తా. అందుకే అంచనాలను ఏ మాత్రం మిస్ అవ్వకుండా శ్రీమంతుడు ఇప్పుడు సరిక్రొత్త రికార్డు సృష్ఠించేసింది. ఓవర్ సీస్ మార్కెట్ లో తనకు తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు సూపర్ స్టార్ మహేష్.
మొదటి మూడు రోజులు పూర్తయ్యేసరికి శ్రీమంతుడు సినిమా అమెరికాలో 2 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్ నుండి బాహుబలి సినిమా తప్పించి ఈ ఫీట్ ఏ ఒక్క స్టారూ చేయలేదు. అదిగో మొన్న అత్తారింటికి దారేది సినిమాతో పవన్ కళ్యాణ్ 1.896 మిలియన్ డాలర్లు వసూలు చేశాడు. కాకపోతే అది సినిమా పూర్తిగా లైఫ్ టైమ్ ఆడేశాక వచ్చిన కలెక్షన్. ఇకపోతే మహేష్ బాబు మాత్రం కేవలం ఫస్టు వీకెండు కే ఇలా 2 మిలియన్ డాలర్ల అంకేసి, ఇప్పుడు అమెరికాలో టాప్ 2 పొజిషన్ లోకి వచ్చేశాడు. ఈ లెక్కన చూస్తుంటే అత్తారింటికి దారేది లైఫ్ టైమ్ కలెక్షన్లకు టాలీవుడ్ లో ఎసరు పెట్టేశేలా ఉన్నాడే మన సూపర్ స్టార్.