టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవలె `సర్కారు వారి పాట`తో ప్రేక్షకులను పలకరించాడు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంటలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ స్వరాలు సమకూర్చారు.
సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ పలు కారణాల వల్ల వాయిదా పడి చివరాఖరకు మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదలై ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.
కానీ, ఇంకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను మాత్రం అందుకోలేకపోయింది. రూ. 121 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం.. మూడు వారాలు పూర్తి చేసుకుని వరల్డ్ వైడ్ గా రూ. 109.17 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది.
సినిమా బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే ఇంకా రూ. 11.83 కోట్ల షేర్ ని రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మూడో వారం వర్కింగ్ డేస్ లో సినిమా స్లో డౌన్ అయినా స్టడీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే నాలుగో వారం కూడా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను అందుకుంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు. పైగా సినిమాకు `మురారివా..` అనే కొత్త పాటని తాజాగా యాడ్ చేయడంతో.. రిపీటెడ్ ఆడియెన్స్ పెరిగే అవకాశాలు సైతం ఉన్నాయి.
కానీ, ఇంతలోనే ఎవరూ ఊహించని విధంగా సర్కారు వారి పాటను సైలెంట్ గా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో పే ఫర్ వ్యూ పద్ధతిలో స్ట్రీమింగ్ చేసేసింది. సినిమాను చూడాలనుకుంటే రూ. 199 చెల్లించి రెంట్ కి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ తొందరపాటు వల్లే మహేశ్ నిండా మునగబోతున్నాడని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎందుకంటే, ఒక్కసారి ఓటీటీలోకి సినిమా వస్తే థియేటర్స్ వంక ఎవరూ పెద్దగా చూడరు. థియేటర్ కి వెళ్లి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టికెట్స్ కొనే బదులు.. ఇంట్లోనే రూ. 199 పెట్టి సినిమాను రెంట్ కు తీసుకుంటే అందరం చూడచ్చని అని అనుకోవడం సహజం. ఇదే జరిగితే మహేశ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అవ్వడం, సర్కారు వారి పాట క్లీన్ హిట్ గా నిలవడం కష్టమే అవుతుందని అంటున్నారు.