ఇటీవల కాలంలో బయోపిక్ లకు గిరాకీ పెరిగింది. హిందీతో పోటీగా తెలుగులోని బయోపిక్ ల హవా నడుస్తోంది. కథానాయుడు మినహా ఇప్పటివరకూ వచ్చిన అన్ని భాషల బయోపిక్ (డబ్బింగ్)లను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు.. అభిమానించారు. ఇప్పటివరకూ వచ్చిన బయోపిక్ లకు ఇప్పుడు వస్తున్న బయోపిక్ లకు తేడా ఏమంటే.. మొన్నటి వరకూ వచ్చినవన్నీ ఇప్పటి తరానికి పెద్దగా తెలీని కేరక్టర్లు. కానీ.. ఇప్పుడు వస్తున్న బయోపిక్ లు సమకాలీన ప్రముఖులు కావటం.. ఇప్పటి తరానికి సైతం వారికి సంబంధించిన విషయాలు తెలిసున్న పరిస్థితి.
మిగిలిన బయోపిక్ లతో పోలిస్తే.. పొలిటికల్ లీడర్స్ మీద వచ్చే బయోపిక్ లతో చాలా కష్టం ఉంటుంది. మిగిలిన రంగాల వారికి సంబంధించిన విషయాలు చాలావరకూ బయటకు రావు. కానీ.. రాజకీయాలు అలాంటివి కావు. అధినేతలకు సంబంధించిన చాలా విషయాలు ఇప్పటికే మీడియాలో రావటమే కాదు.. ప్రజలకు సైతం ఫస్ట్ హ్యాండ్ లేదంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదే.. బయోపిక్ లు తీసే దర్శకుడికి కత్తి మీద సాముగా మారుతుంది. మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 8) యాత్ర పేరుతో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో సినిమా రానుంది. ఈ సినిమా మొదలైప్పుడు ఉన్న అంచనాలకు.. ఇప్పటికి పోలికే లేదు. దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమా చాలానే కసరత్తు చేసినట్లు చెబుతున్నారు.
తన సినిమా విడుదలకు రెండురోజుల ముందు ఆయన విడుదల చేసిన ఒక లేఖ అందరి దృష్టిని ఆకర్షించటమే కాదు.. ఆయన చెప్పిన మాటలు మనసును దోచుకునేలా ఉన్నాయి. ఎన్టీఆర్.. వైఎస్సార్ లు ఇద్దరూ తెలుగు నేల వారసులని.. వారి మీద మనకు అభిప్రాయబేధాలు ఉండొచ్చు..కానీ.. వారి గౌరవానికి భంగం కలిగించేలా చేయకూడదన్న మాటను వినమ్రంగా చెప్పిన వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
చిత్ర బృందమంతా చాలా కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించినట్లుగా చెప్పారు. తన సినిమాను మరో సినిమాతో ముడిపెట్టొద్దన్న మంచి మాటను చెప్పారు. ఒక గొప్ప నాయకుడి ప్రయాణాన్ని సంతోషంగా అస్వాదిద్దామన్న ఆయన.. ఎన్టీఆర్.. వైఎస్సార్ లు ఇద్దరూ తెలుగుజాతి గర్వించదగ్గర గొప్ప దిగ్గజాలన్నారు.
వారంతా ఈ మట్టి వారసులని.. అలాంటి వారిని తమకున్న అభిప్రాయ బేధాలతో కించపరిచే పని చేయొద్దని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్.. చిరంజీవిల మీద తనకెంతో అభిమానమని.. అలా అని ఇతరుల మీద ద్వేషం తనకు లేదన్నారు. ముచ్చటైన మాటలతో మనసు దోచేసిన మహి.. యాత్ర మూవీని ఎలా తీశారో చూడాలి. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. యాత్ర బృందానికి మాత్రం ఆల్ ద బెస్ట్ చెబుదాం.