నాగచైతన్య.. సమంతాలు జోడీగా నటించిన 'మజిలీ' ఈ శుక్రవారమే రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా మొదటి రోజునుండే మంచి కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్స్ నిలకడగా ఉండడంతో నాలుగో రోజుకే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయింది. అయిదో రోజుకు అన్ని ఏరియాలో బ్రేక్ ఈవెన్ మార్కును దాటి లాభాల్లోకి వచ్చేసింది.
'మజిలీ' సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 21 కోట్లకు అమ్ముడయ్యాయి. ఐదవ రోజుకు ప్రపంచవ్యాప్తంగా 'మజిలీ' రూ.22 కోట్ల షేర్ ను సాధించింది. కలెక్షన్స్ జోరు ఇంతటితో ఆగడం లేదు. కలెక్షన్స్ ఇంకా నిలకడగానే ఉంటున్నాయి. ఈలెక్కన 'మజిలీ' రూ. 30 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమీ కాదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలా జరిగితే నాగ చైతన్య కెరీర్ లో ఇది మొదటి 30 కోట్ల సినిమాగా రికార్డులకెక్కుతుంది.
లోకల్ గానే కాదు ఓవర్సీస్ లో కూడా 'మజిలీ' ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఇప్పటివరకూ 'మజిలీ' ఓవర్సీస్ లో $600K కలెక్ట్ చేసింది. రెండో వారాంతంలో కూడా ఇదే జోరు కంటిన్యూ అయితే వన్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరడం కష్టమైన పనేమీ కాదు. అక్కినేని ఫ్యామిలీకే కాదు.. అక్కినేని ఫ్యాన్స్ అందరికీ 'మజిలీ' పండగను తీసుకొచ్చింది.