టాలీవుడ్ లో ఇప్పుడు పార్టీలకు కొదవేం లేదు. సినిమా రిలీజ్ అయితే పార్టీ, ట్రైలర్ లాంచ్ అయితే పార్టీ.. సినిమా ఫ్లాపైనా కూడా పార్టీ చేసుకొని బాధపడే స్థాయికి వచ్చేశారు మనోళ్లు. అయితే ఈ పార్టీలన్నీ ఇప్పుడు కెమెరా కళ్లకు చిక్కకుండా జరిగితే పర్లేదు కాని, అన్నీ కెమెరాల ముందుకు వచ్చేస్తే మాత్రం కాస్త ఎటకారంగా ఉంటుంది.
నిన్ననే మాలిన అండ్ కో అంటూ పూనం పాండే సెంట్రల్ లీడ్‌గా నటించిన తెలుగు సినిమా తాలూకు 'ఛీర్స్ పార్టీ' అంటూ ఏదో జరిపారు. ఈ పార్టీ తాలూకు ఫోటోలన్నీ ఒకెత్తయితే.. అందులో సదరు సినిమా ముఖ్యలు మందు కొడుతూ కనిపించిన ఫోటోలు మరో ఎత్తు. ఇక మనోళ్ల సంగతి పెట్టేస్తే, ఓ లోకల్ హీరోయిన్ అక్కడ హుక్కా కొట్టేస్తూ కూడా దర్శనమిచ్చింది.
అసలు ఈ ఫోటోలన్నీ బయటకు రాకపోతే ఓకె కాని.. వచ్చేశాక మాత్రం ఈ రచ్చపైన జనాలు చేసే కామెంట్లు ఓ రేంజులో ఉంటాయి. అసలు ఈ పార్టీ ఎందుకు బాబులూ అంటూ కొందరు ప్రశ్నిస్తే, ఈ పార్టీలన్నీ ఇలా మీడియాకు చూపించేస్తే ఇక రేపొద్దున్న సినిమా ఇండస్ట్రీ పరువేం కాను అంటూ దంచేశేవారూ ఉన్నారు. మందు, హుక్కా వంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తారేటండీ? ఏందో ఈ పార్టీలు, వీళ్ల పబ్లిసిటీలు.