మన్నారా చోప్రా బాలీవుడ్ భామే అయినా.. తెలుగుతోనే అరంగేట్రం చేసింది. తెలుగులోనే ఎక్కువగా నటిస్తోంది. గతేడాది జక్కన్న.. తిక్క సినిమాలను రిలీజ్ చేసిన ఈ భామ.. ఇప్పుడు పూరీ దర్శకత్వంలో రూపొందిన రోగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
పూరీ సినిమాలో నటించడం అంటే.. అదే పెద్ద అఛీవ్మెంట్ అంటోంది మన్నారా. రోగ్ లో ఓ సింగర్ గా నటిస్తున్న ఈమె.. పాటలు పాడి తన కుటుంబానికి ఆర్థికంగా సాయం చేసే పాత్రలో కనిపించనుంది. పూరీ సినిమాల్లో సహజంగా హీరోయిన్లకు ఎక్కువగా స్కోప్ ఉండదు కానీ.. ఈ మూవీలో హీరోయిన్ రోల్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని.. స్వయంగా పూరీనే చెప్పాడట. వేరే హీరోయిన్ తో కలిసి స్క్రీన్ పంచుకోవడంలో తనకేమీ ఇబ్బంది లేదని తేల్చేసింది ఈ బ్యూటీ.
తెలుగమ్మాయి లుక్ కోసం మేకప్ కూడా లేకుండా రోగ్ లో నటించేశానని చెబుతోంది మన్నారా. 'ఈ మూవీ కోసం ప్రతీ షాట్ ని రెండు సార్లు తీశారు. కన్నడ.. తెలుగు భాషల కోసం లిప్ సింక్ అయేందుకు.. ఇలా చేయాల్సి వచ్చింది. రెండు భాషల్లో డైలాగ్స్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమైంది. కానీ పూరీ ముందే స్క్రిప్ట్ ఇచ్చేయడంతో ఇది సులువైంది. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా చాలా సాయం చేశారు' అని చెప్పింది మన్నారా చోప్రా.
హాలీవుడ్ వరకు వెళ్లిపోయిన టాప్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు.. మన్నారా కజిన్ సిస్టర్ అనే విషయం తెలిసిందే. పలు భాషల్లో సినిమాలు చేస్తున్న ప్రియాంక.. ఇప్పుడు తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందంటూ కొత్త కబురు చెబుతోంది మన్నారా చోప్రా. ఇప్పటికే డిస్కషన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్టులో.. తానే హీరోయిన్ గా నటిస్తానని కూడా చెబుతోంది.
ఇక కొత్త సినిమాలు సైన్ చేయడం అంటే.. రోగ్ రిలీజ్ అయిన తర్వాతే అనేసిన మన్నారా చోప్రా.. సరైన టైమింగ్ లో రిలీజ్ చేయడం కోసమే.. గతేడాదే విడుదల కావాల్సిన రోగ్ ఆగిందని అంటోంది. ఇప్పుడు సిట్యుయేషన్ చూస్తుంటే.. లేట్ అవడం కూడా మంచిదే అనిపిస్తోందట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/