హరియాణాకు చెందిన మోడల్ కం నటి మీనాక్షి చౌదరి తెలుగు - తమిళ చిత్రాల్లో వరుసగా ఆఫర్లు అందుకుంటోంది. తెలుగులో సుశాంత్ సరసన `ఇచట వాహనాములు నిలుపరాదు` చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి సినిమా రిలీజ్ కు ముందే అమ్మడు వరుసగా ఛాన్సులందుకుని ఆశ్చర్యపరిచింది.
మీనాక్షి అందాల పోటీల నుంచి వచ్చిన నటి. అందువల్ల తన క్రేజ్ స్కైలో ఉంది. రెండో ప్రయత్నంగా ఈ భామ మాస్ రాజా రవితేజ సరసన `ఖిలాడీలో`నూ నటిస్తోంది. అలాగే యంగ్ హీరో అడవి శేష్ తో `హిట్-2` లో కూడా నటిస్తుంది. తొలి సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ సంగతి పక్కన బెడితే ఇంకా రెండు చిత్రాలు చేతిలో ఉండటం మీనాక్షి చౌదరికి కలిసొచ్చే అంశం. అందుకే ఈ బ్యూటీ తెలుగు భాషపైనా పట్టు సాధించే ప్రయత్నం చేస్తుంది. మీడియా ఇంటర్వ్యూల్లో అప్పుడే తెలుగమ్మాయిలా గలగలా భాష మాట్లాడేస్తోంది.
మొదటి సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. దీంతో మీనాక్షి భాష నేర్చుకునే విషయంలో ఎంత ఫ్యాషన్ తో ఉందో అర్ధమవుతోంది. అయితే తెలుగు నేర్చుకోవడానికి మీనాక్షి ఎంతగా శ్రమించిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. తెలుగు నేర్చుకోవడం మొదట్లో చాలా కష్టమైందని దీంతో ఆ భాషను సవాల్ గా తీసుకుని నేర్చుకున్నట్లు తెలిపింది. పంజాబ్.. హర్యానా లో పుట్టి పెరగడం.. అటుపై ముంబైలో ఉండటం కారణంగా స్థానిక భాషలు..ఇంగ్లీష్ తప్ప ఇంకే భాషలు రావు అంది. హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన భాషలు మాట్లాడితే పనవ్వదని అర్ధమైంది. నా చుట్టూ ఉన్న వారు కూడా తెలుగు వాళ్లు కావడంతో ఇంకా ఇబ్బందిగా మారింది.
దీంతో భాషను నేర్చుకోవాలని బలంగా సంకల్పించి ముందుకు కదిలాను. నా సినిమా డైలాగులను ముందు రోజు రాత్రి హిందీలోకి మార్చుకుని తర్వాత స్థానిక భాషలోకి తెలిసిన వాళ్ల ద్వారా తర్జుమా చేసి చెప్పేదాన్ని. అలా తెలుగు కొంచెం అర్ధమైంది. రెండవ సినిమాకి ఆ ప్రాక్టీస్ ఎంతో పనికొచ్చిందని తెలిపింది. ఇప్పుడు తెలుగు మాట్లాడటం..అర్ధం చేసుకోవడం చాలా సులభంగా ఉందని తెలిపింది. కెరీర్ ఆరంభంలోనే మీనాక్షి చౌదరి ఇంత తొందరగా తెలుగు నేర్చుకోవడం అనేది గొప్ప విషయమే. చాలా మంది స్టార్ హీరోయిన్లకు ఇప్పటికీ సరైన తెలుగు మాట్లాడటం తెలియదు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తెలుగులో అనర్ఘళంగా మాట్లాడగలనని ధీమా వ్యక్తం చేయడం విశేషం. చూస్తుంటే అందాల పోటీల నుంచి వచ్చిన రకుల్ ప్రీత్ ని ఈ బ్యూటీ రీప్లేస్ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది.