కొన్ని మెలోడీలు రేర్ గానే చార్ట్ బస్టర్లు అయ్యే అర్హతను కలిగి ఉంటాయి. అలాంటి ఓ పాటను వినాలనిపిస్తే ఇది వినాలి అనేంతగా ఇటీవల ఏదీ రాలేదు. అల వైకుంఠపురములో సినిమాలో మెలోడీస్ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల మనసు గెలిచాయి. రాములో రాములా ఓ ఊపు ఊపింది. సంగీత దర్శకుడు థమన్ పేరు మార్మోగింది. భీష్మ సినిమాలో పాటలకు అంతే మంచి అప్లాజ్ వచ్చింది. విజువల్ గానూ బన్ని.. నితిన్ మ్యాజికల్ డ్యాన్సులు మెప్పించాయి. ఇటీవల ఓటీటీ సినిమాలకు మళ్లీ అంత సీన్ లేనేలేదు.
ఓటీటీ తెలుగు సినిమాల పాటలేవీ ఎవరికీ గుర్తు లేవు. అదంతా సరేకానీ.. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమా త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రమోషనల్ మెటీరియల్ కి చక్కని స్పందన వచ్చింది. తాజాగా జీవీ ప్రకాష్ సంగీతం అందించిన కాటుక కనులే.. మెలోడీ నెటిజనుల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆహా ఓహో అనేంత కాకపోయినా ఈ పాటకు బాణీ పర్ఫెక్ట్ లెంగ్త్ లోనే సెట్టయ్యింది. ఇక బేబి బేకరీ పడుచు పిల్ల వెంటపడేవాడిగా సూర్యను ఓ రేంజులోనే చూపించారు. బేకరీ పిల్ల అలా ఆటోలో పాంప్లెట్లు పంచుతూంటే .. ఆ ఆటో వెంటే బైక్ మీద వెంబడించే పిల్లగాడిగా సూర్య ఆహార్యం కుర్రకారుకు ఇట్టే కనెక్టయిపోయింది. సూర్య నిజానికి ఈ చిత్రంలో గల్లీ నుంచి దిల్లీ వరకూ ఎదిగిన గ్రేట్ బిజినెస్ మేన్ గానూ కనిపించనున్నారు.
తాజా సింగిల్ లో సూర్య మార్క్ ట్రీట్ అభిమానులకు కను విందు చేసింది. ఆహ్లాదకరమైన ట్రీట్ ను అందించింది. ముఖ్యంగా సూర్య- అపర్ణ బాలమురళి జంట కెమిస్ట్రీ మైమరిపించింది. అపర్ణ సహజ బొద్దు సౌందర్యం వాస్తవిక నేపథ్యం మైమరిపిస్తున్నాయి. ముఖ్యంగా జీవీ అందించిన క్లాసిక్ ట్యూన్ ఎంతో ప్లెజెంట్ గా ఆకట్టుకుంది. గురూ లాంటి క్లాసిక్ సినిమా తీసిన సుధ కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండడం ఆసక్తికరం.
Full View

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషించారు. పరేష్ రావల్- ఊర్వశి- కరుణస్ తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. నిజ జీవిత వ్యక్తిత్వంతో ప్రేరణ పొంది రూపొందించిన చిత్రమిది. సూరియా 2డి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.