దిల్ రాజుకు ఎమ్మెల్యే ఫోన్ చేసి..

Update: 2017-01-18 06:55 GMT
రెండు పెద్ద సినిమాలు బరిలో ఉన్న వేళ.. ఒక చిన్న సినిమా విడుదల చేయాలంటేదానికి చాలానే గట్స్ కావాలి. అన్నింటికి మించిన తన సినిమా మీద నమ్మకం ఉండాలి. ఇద్దరు అగ్రహీరోలు ప్రతిష్ఠాత్మకంగా తమ చిత్రాలను తీసుకున్నప్పుడు థియేటర్లు దొరకటం కూడా కష్టమే కానీ.. అక్కడ సీన్లో ఉన్నది దిల్ రాజు అయినప్పుడు థియేటర్ ఇబ్బందులు ఉండవు కదా.

అందుకే.. ఆయన తన తాజా చిత్రమైన శతమానం భవతి చిత్రాన్ని దాదాపు 250థియేటర్లలో రిలీజ్ చేశారు. అప్పటికే ఖైదీ.. శాతకర్ణి సినిమాలు బాగున్నాయన్నటాక్ తో దూసుకెళుతున్న వేళ.. సైలెంట్ గా వచ్చిన శతమానం భవతి మౌత్ టాక్ ఫస్ట్ షో నుంచి స్ప్రెడ్ అయ్యిందని చెప్పాలి.

ఈ సినిమాను చూసిన నెల్లూరుకు చెందిన ఎమ్మెల్యే శ్రీధ‌ర్‌ రెడ్డి దిల్ రాజు ఫోన్ నెంబరు కోసం చాలా ప్రయత్నించారట. పలువురు స్నేహితులకు ఫోన్ చేసి.. చివరకు నెంబరును సంపాదించి దిల్ రాజుకు ఫోన్ చేశారట. సినిమా అద్భుతంగా ఉందంటూ దాదాపు పావుగంట సేపు సినిమా గురించి మాట్లాడరట. ఈ విషయాన్ని ఎవరో కాదు.. దిల్ రాజే చెప్పుకొచ్చారు. సదరు ఎమ్మెల్యే మాదిరి చాలామంది ఫోన్లు చేసి.. చాలామంచి సినిమా తీశారంటూ మెచ్చుకుంటున్నారని.. సంక్రాంతికి విడుదలైన పెద్దసినిమాలతో పాటు.. తన సినిమా కూడా దూసుకెళుతున్న విషయాన్ని చెప్పుకొచ్చారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News