వైఎస్ వివేకానంద రెడ్డికి మోహన్ బాబు నివాళి
మోహన్ బాబు పైకి చాలా రఫ్ గా కన్పిస్తారు కానీ లోపల మాత్రం ఆయన మనసు వెన్న.తన అనుకుంటే చాలు వాళ్లకోసం ఎంతదూరం అయినా వెళ్తారు. ఏదైనా చేస్తారు. అదే సమయంలో.. తన మనస్సుకు దగ్గరి అయినవాళ్లకు ఏదైనా అయినా కూడా తట్టుకోలేకపోతారు. వైఎస్ వివేకానంద మరణం నేపథ్యంలో.. ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు మోహన్ బాబు. వైఎస్ వివేకానందకు - మంచు ఫ్యామిలీకీ బంధుత్వం ఉంది. మంచు విష్ణు భార్య వెరొనికాకు వైఎస్ వివేకానందరెడ్డి బాబాయ్ అవుతాడు. అదీగాక.. వైఎస్ వివేకాకు - మోహన్ బాబుకు మాంచి సాన్నిహత్యం ఉంది. దీంతో.. ఆయన మరణవార్తను మోహన్ బాబు తట్టుకోలేకపోయారు. కన్నీళ్లపర్యతం అయ్యారు. మంచు విష్ణు - వెరొనికా కూడా వైఎస్ వివేకానందరెడ్డి భౌతికకాయం వద్ద భోరున విలపించారు.
మోహన్ బాబు అంతే. తన అనుకున్న వాళ్లకు ఏం జరిగినా తట్టుకోలేదు. మొన్నటికి మొన్న కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ చనిపోయినప్పుడు కూడా మోహన్ బాబు చిన్నపిల్లాడిలా ఏడ్చారు. ఎందుకంటే.. అంబరీష్ - మోహన్ బాబు ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ కూడా. ఇక దాసరి మరణం అప్పుడు కూడా మోహన్ బాబు తల్లడిల్లిపోయారు. ఆయన మరణవార్త విని తట్టులోకేపోయారు. హాస్పిటల్ దగ్గరే ఏడ్చేశారు. పైకి గంభీరంగా కన్పించే మోహన్ బాబు.. తన వాళ్లకు ఏదైనా జరిగినప్పుడు మాత్రం అల్లాడిపోతారు.