`గాడ్ ఫాదర్` సక్సెస్ తో మెగాస్టార్ చిరంజీవి మంచి ఉత్సాహంతో ఉన్నారు. మెగా అభిమానుల్లో అంతే జోష్ కనిపిపస్తోంది. మెగాస్టార్ గత సినిమా `ఆచార్య` బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టడంతో చిరు ఎలాంటి విమర్శలు ఎదుర్కున్నారో తెలిసిందే. మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ డిజాస్టర్ కావడంతో ఆ సినిమా అందర్నీ బాగా డిస్టబెన్స్ కి గురి చేసింది.
అన్నింటి మించి చిరంజీవి సతీమణి సురేఖ సైతం ఎంతో మనస్తాపానికి గురైనట్లు వెలుగులోకి వచ్చింది. ఇంకా సినిమా ప్లాప్ తో భారీ నష్టాలు తప్పలేదు. ఇలా అందర్నీ షేక్ చేసిన `ఆచార్య` ప్లాప్ తర్వాత `గాడ్ ఫాదర్` రూపంలో బ్లాక్ బస్టర్ దక్కితే ..ఆ ఆనందమే వేరే లెవల్లో ఉంటుంది. ప్రస్తుతం చిరంజీవి సహా మెగా ఫ్యామిలీ అంతా ఎంతో సంతోషంగా ఉంది.
అయితే `ఆచార్య` సినిమాలో చిరంజీవి వేలు పెట్టారని..సినిమా ప్లాప్ అవ్వడానికి అతను ప్రధాన కారణంగా ఆ మధ్య వినిపించింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ సైతం జరిగింది. తాజాగా గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్ లో చిత్ర దర్శకుడు మోహన్ రాజా మెగా ఔన్నత్యాన్ని చెప్పుకొచ్చే ప్రయత్నం చేసారు.
`చిరంజీవి గారు దర్శకుడు పనిలో వేలు పెడతారని అనేవాళ్లని తన్నుతాను. ఆయన 150కి పైగా సినిమాల్లో నటించారు. ఎంతో అనుభవం ఉంది. ఆయన ఏదైనా బాగోలేదని ఎవరికైనా సలహా ఇవ్వొచ్చు. అది కచ్చితంగా నిజం అవ్వొచ్చు. చిరంజీవి సలహాలు పాటించడం వల్లే గాడ్ పాదర్ ఇంత పెద్ద సక్సెస్ సాధించింది అన్నారు.
దీంతో ఓ సెక్షన్ ఆడియన్స్ మోహన్ రాజాకి ఓటేస్తున్నారు. ఆయన చెప్పింది నిజమే అంటున్నారు. వ్యతిరేక వర్గం మాత్రం ఆచార్య పరాజయాన్ని గుర్తు చేస్తున్నారు. ఆచార్య లో చిరంజీవి వేలు పెట్టడం వల్లే సినిమా పోయింది. ఆయన కెలక్కపోయుంటే కొరటాల గొప్ప సినిమా చేసేవాడని కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
కారణాలు ఏవైనా ఆచర్య గతం..`గాడ్ ఫాదర్` వర్తమానం. గతాన్ని తలుచుకుని వాపోవడం కన్నా..వర్తమానాన్ని ఆస్వాదించడం ఉత్తమం అన్నది విశ్లేషకుల మాట. అయితే మోహన్ రాజా వ్యాఖ్యలు కాస్త అతిగా ఉన్నాయని... చిరంజీవి వ్యక్తిగత భజనలా కనిపిస్తుందంటూ కొంత మంది నెటి జనులు కామెంట్లు పెడుతున్నారు. వాటిపైనా చిరు అభిమానులు భగ్గుమంటున్నారు.