లీక్ చేస్తున్నారా ..లీక్ అవుతున్నాయా?

Update: 2022-02-19 06:47 GMT
ఈ మ‌ధ్య స్టార్ హీరోల‌కు సంబంధించిన ప్ర‌తీ సినిమా ఆన్ లొకేష‌న్ ఫొటో లు లీక‌వుతూనే వున్నాయి. సెట్ లో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా.. ఎవ‌రో ఒక‌రు లీక్ చేస్తూనే వున్నారు. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `ఆర్ ఆర్ ఆర్‌` సినిమా నుండి ఈ లీకుల బెడ‌ద అధికంగా వినిపించ‌డం మొద‌లైంది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ , యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తొలి సారి క‌లిసి న‌టించిన అత్యంత భారీ మ‌ల్టీ స్టార‌ర్ ఇది. ఈ మూవీపై భారీ క్రేజ్ ఏర్ప‌డ‌టంతో సినిమా ఎలా వుండ‌బోతోందా? అనే ఆస‌క్తి ప్ర‌తీ ఒక్క‌రిలోనూ మొద‌లైంది.

దీంతో ఈ మూవీకి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల ఫొటోలు తీక్ కావ‌డం రాజ‌మౌళిని క‌ల‌వారినికి గురిచేసింది. సినిమాలో ప్ర‌ధాన హైలైట్ గా నిలిచే  పులితో  ఎన్టీఆర్ చేసే ఫైట్ కి సంబంధించిన ఫొటోలు లీక్ అయి నెట్టింట వైర‌ల్ గా మారిన విష‌యం తెలిసిందే.  ఆ త‌రువాత రామ్ చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగా క‌నిపించే ఫొటోలు కూడా బ‌య‌టికి రావ‌డంతో చిత్ర బృందం లీకుల‌పై ఎల‌ర్ట్ అయింది. ఆ త‌రువాత ఈ మూవీ నుంచి పెద్ద‌గా లీకులు రాలేదు. ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన `వ‌కీల్ సాబ్‌` కూడా లీకుల బెడ‌ద‌ని ఎదుర్కొంది.

దిల్ రాజు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ఆన్ లొకేష‌న్ పిక్స్ వ‌రుస‌గా లీక్ అవుతూ కంగారు పెట్టించాయి. దీంతో దిల్ రాజు టీమ్ మెంబ‌ర్స్ కి సీరియ‌స్ గా వార్నింగ్ ఇచ్చినంత ప‌ని చేయ‌డంతో లీకులు ఆగిపోయాయి. ఆ త‌రువాత `భీమ్లా నాయ‌క్‌` నుంచి కూడా లీకులు వ‌చ్చాయి. ఏకంగా లొకేష‌న్ సీన్సే లీక్ కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇదిలా వుంటే మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రాల‌కు సంబంధించిన ప్ర‌తీదీ లీక్ అవుతండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మైత్రీమూవీమేక‌ర్స్  వారు నిర్మించిన పుష్ప‌.. ఆన్ లొకేష‌న్ స్టిల్స్ , కీల‌క ఘ‌ట్టానికి సంబంధించిన‌ షూటింగ్ ఫుటేజ్‌, దాక్కో దాక్కో మేక‌.. ఇలా లీక్ అయిపోయి నెట్టింట వైర‌ల్ గా మారాయి. భారీ సినిమాకుఉ సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌న్నీ ఇలా లీక్ అయిపోతూ నెట్టింట ద‌ర్‌శ‌న‌మివ్వ‌డంతో లీక్ అవుతున్నాయా? లీక్ చేస్తున్నారా? అనే చ‌ర్చ మొద‌లైంది. ఆ త‌రువాత కూడా ఇదే సంస్థ నిర్మిస్తున్న `స‌ర్కారు వారి పాట‌` సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టిస్తున్న ఈ మూవీ కి సంబంధించిన ప్ర‌తీదీ లీక్ అవుతూనే వుంది.  

ఫ‌స్ట్ లుఏక్ ద‌గ్గ‌రి నుంచి నిన్న విడుద‌లైన `క‌ళావతి` సాంగ్ వ‌ర‌కు లీకులు అవుతూనే వున్నాయి. స్టార్ హీరో సినిమాకు సంబంధించిన స్ట‌ఫ్ ఇలా లీకు కావ‌డం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సంస్త‌కు చెందిన చిత్రాలే ఎందుకు లీక్ కు గుర‌వుతున్నాయ‌ని చ‌ర్చించుకుంటున్నారు. తాజాగా నంద‌మూరి బాల‌కృష్ణ‌తో మైత్రీ సంస్థ చేస్తున్న మూవీ స్టిల్ కూడా లీక్ కావ‌డం తెలిసిందే. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తున్న 107వ చిత్ర‌మిది. ఇందులో బాల‌య్య ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. గోపీ చంద్ మ‌లినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తోంది.

ఈ శుక్ర‌వార‌మే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైంది. అయితే ఇందులో బాల‌య్య‌ లుక్ ఇలా వుంటుంద‌ని ఇంత వ‌ర‌కు ఎలాంటి వార్త బ‌య‌టికి రాలేదు కానీ షూటింగ్ మొద‌లైన తొలి రోజే బాల‌కృష్ణ గెట‌ప్‌, సాల్ట్ అండ్ పెప్ప‌ర్ లుక్ లో సెల్ లో బాల‌కృష్ణ చైర్ పై కూర్చుని వున్న స్టిల్ బ‌య‌టికి రావ‌డం క‌ల‌క‌ల‌కంగా మారింది. షూటింగ్ మొద‌లైన తొలి రోజు లుక్ బ‌య‌టికి రావ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. స్టార్ హీరో సినిమా విష‌యంలో జాగ్ర‌త్త‌లు తీసుకుంటే ఇలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈమూవీలో క‌న్న‌డ స్టార్ దునియా విజ‌య్ విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు. 
Tags:    

Similar News