నా 100 ముద్దులు ఆ హీరోకే: నటి సురేఖావాణి

Update: 2021-05-14 00:30 GMT
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు ఇరవై సంవత్సరాలకు పైగా ఆమె సినీ ఇండస్ట్రీలో నటనతో లక్షల్లో ప్రేక్షకులను సంపాదించుకుంది. ఇప్పటివరకు సినిమాల్లో ఎక్కువగా సురేఖావాణి ఓ అక్క - పిన్ని - అత్త - నర్స్ ఇలాంటి పాత్రలతో బాగా సుపరిచితం. అయితే సురేఖావాణి సినిమాలే కాదు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ అనే సంగతి ఆమె అభిమానులకు బాగా తెలుసు. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పలు విషయాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. అయితే తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా' అనే టాక్ షోలో పాల్గొంది.

ఆ ప్రోగ్రాంలో కమెడియన్ ఆలీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూనే ఆమె లైఫ్ - కెరీర్ కు సంబంధించిన పలు విషయాలు బయటపెట్టింది. అలాగే కొన్ని సరదా కబుర్లు కూడా చెప్పుకొచ్చింది. సురేఖా కొంతకాలంగా సినిమాల్లో కనిపించడం లేదని ఫ్యాన్స్ వాపోతున్నారు. ఇదిలా ఉండగా.. 'అలీతో సరదాగా' ప్రోగ్రాంలో ఆలీ అడిగిన పలు ప్రశ్నలకు క్రేజీ ఆన్సర్స్ చెప్పింది సురేఖా. ఈ నేపథ్యంలో ఆలీ మాట్లాడుతూ హీరో మెగాస్టార్ చిరంజీవి టాపిక్ తీశారు. చిరంజీవిని మొదటిసారి చూడగానే మీరు ఏడ్చేశారట.. నిజమేనా? అని అలీ అడిగాడు.

ఆ ప్రశ్నకు సురేఖా మాట్లాడుతూ.. "అదేంటో.. తెలియలేదు. ఆయనను చూడగానే పటపటా కన్నీళ్లు వచ్చేశాయి. నేనలా ఏడుస్తుంటే చిరంజీవి గారు దగ్గరకొచ్చి అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావ్. ఏడవకు.. ఏడవకు అని పట్టుకొని హగ్ చేసుకున్నారు. ఒక్కోసారి గుళ్లోకి వెళ్లినపుడు దేవుడిని చూస్తే ఏడుపొస్తుంది.. అలాగే చిరంజీవిని చూస్తే కూడా నాకు ఏడుపొచ్చేసింది'' అని సురేఖావాణి చెప్పింది. అయితే పెళ్లికి ముందే ఆర్. నారాయణమూర్తి గారి తెలుగోడు అనే సినిమాతో సినీప్రయాణం మొదలైందని తెలిపింది. తర్వాత అలీ మరో క్రేజీ ప్రశ్న అడిగాడు.. "మీరు ప్రస్తుతం 100 ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరు? అనే ప్రశ్నకు.. 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' అని చెప్పింది సురేఖా. అలాగే తన దృష్టిలో కత్తిలా ఉందనిపించే హీరోయిన్ ఓన్లీ శ్రీదేవి చెప్పుకొచ్చింది సురేఖావాణి.
Tags:    

Similar News