#RRR ప్ర‌చార ఎత్తుగ‌డ‌లో నిగూఢ ర‌హ‌స్యం

Update: 2021-11-01 04:30 GMT
భారీ చిత్రాల్ని తెర‌కెక్కించ‌డ‌మే కాదు.. మార్కెట్ చేయ‌డంలోనూ మేధోత‌నం ప‌ని చేయాలి. ఈ రెండు విభాగాల్లో ఉద్ధండుడు కాబ‌ట్టే ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్.రాజ‌మౌళి ఏం చేసినా అది సంచ‌ల‌నంగా మారుతోంది. ఇంత‌కుముందు బాహుబ‌లి 1 .. బాహుబ‌లి 2 చిత్రాల‌ను గ్రాండ్ గా తెర‌కెక్కించ‌డమే కాదు.. పాన్ ఇండియా కేట‌గిరీలో మార్కెట్ చేయ‌డంలోనూ గొప్ప టెక్నిక్స్ ని ఉప‌యోగించి స‌క్సెస‌య్యారు.

ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ రూపంలో అంత‌కుమించిన సినిమాని తీశారు రాజ‌మౌళి. #RRR చిత్రంలో న‌టించిన స్టార్ హీరోలు ప్రచారం చేయకముందే దానికి సరైన క్రేజు పెరిగేలా చూసుకుంటున్నారు. ప్ర‌తిదీ సక్సెస‌వుతోంది. పోస్ట‌ర్లు ప్రోమోలు ఇత‌ర మేకింగ్ వీడియోలు ప్ర‌తిదీ వైర‌ల్ అయ్యేలా చేశారు. ఇక బాలీవుడ్ మీడియా అయితే రాజ‌మౌళి ఏం చేసినా ప‌రిశీల‌న‌గా చూస్తోంది. RRR రిలీజ్ కి ఇంకెంతో పెద్ద డెడ్ లైన్ లేదు. 7 జనవరి 2022న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంటే కేవ‌లం న‌వంబ‌ర్ డిసెంబ‌ర్ లోనే ఏం చేయాల‌న్నా. అందుకే రాజ‌మౌళి ఇప్ప‌టికే హిందీ మీడియాలో ప్ర‌చారం స్టార్ట్ చేసేసారు. అక్క‌డ భారీ మార్కెట్ చేస్తున్నారు కాబ‌ట్టి దానికి త‌గ్గ‌ట్టు వ‌సూళ్ల‌ను తెచ్చేలా ప్లాన్ ని డిజైన్ చేశారు.

అంతేకాదు.. త‌న సినిమా బ‌జ్ ని పెంచేందుకు కొంద‌రు బాలీవుడ్ టాప్ క్రిటిక్స్ కి పాత్రికేయులకు #RRR కి సంబంధించిన విజువ‌ల్ ని చూపించార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ వీడియోలు ఫోటోల మాష‌ప్ వ‌గైరా చూసి చాలా అత్యద్భుతంగా ఉన్నాయ‌ని కితాబు అందుకున్నార‌ట‌. ప్ర‌స్తుతం హిందీ బెల్ట్ లో బాహుబలి కంటే అద్భుతమైన సినిమా తీశార‌న్న ప్ర‌చారాన్ని స్ప్రెడ్ చేశారు. అది ఆ నోటా ఈనోటా ఇప్ప‌టికే తెలుగు పాత్రికేయుల‌కు చేరింది. అస‌లు ఇక్కడ ఎలాంటి చ‌ప్పుడు లేకుండానే అక్క‌డ అన్నీ చూపించేస్తూ జ‌క్క‌న్న ఇలా చేస్తున్నారేమిటీ? అన్న గుస‌గుస వినిపిస్తోంది.

అయితే మార్కెట్ చేయ‌డంలో లేదా ప్ర‌చారం చేయ‌డంలో జ‌క్క‌న్న‌కు త‌న‌దైన విధానం ఉంది. ఈ స్పేస్ లోకి ఎవ‌రినీ జొర‌బ‌డ‌నివ్వ‌రు. ప్ర‌స్తుతం హిందీ మీడియాకు విజువ‌ల్స్ చూపించి త‌ర్వాత తెలుగు మీడియా ద్వారా ప్ర‌చారం కానిచ్చేస్తారు. కాస్త ఓపిక ప‌డితే ఆ ఛాయిస్ అంద‌రికీ ఉంటుంది. ఇక హిందీ- తెలుగుతో పాటు త‌మిళం -మ‌ల‌యాళం-క‌న్న‌డ ప్ర‌తిచోటా స్థానిక భాష‌ల్లో స్పీచ్ లు ఇచ్చేందుకు జక్క‌న్న టీమ్ రెడీ అవుతోంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. రాజ‌మౌళి ప్ర‌చార ఎత్తుగ‌డ‌ను ఎవ‌రూ త‌ప్పుప‌ట్ట‌లేరు .. ఏం చేసినా..! ఆర్.ఆర్.ఆర్ తో మ‌రోసారి పాన్ వ‌ర‌ల్డ్ రేంజులో తెలుగు వారి ఘ‌న‌కీర్తిని చాటుతార‌నే ఆశిద్దాం.

నిర్మాణానంత‌ర ప‌నుల్లో బిజీ

ప్ర‌స్తుతం `రౌద్రం రణం రుధిరం` ప్ర‌మోష‌న్స్ లో వేగం పెంచేందుకు జ‌క్క‌న్న బృందం స‌న్నాహ‌కాల్లో ఉంది. ప్ర‌తిచోటా స్థానిక భాష‌ను నేర్చుకుని మ‌రీ బ‌రిలోకి దిగాల‌న్న‌ ప్లాన్ ని కూడా అమ‌ల్లోకి తెస్తున్నారు. ఓవైపు నిర్మాణానంత‌ర ప‌నులు శ‌ర‌వేగంగా పూర్త‌వుతున్నాయి. చ‌ర‌ణ్‌-తార‌క్ స‌హా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఆల్రెడీ తన పాత్రకి డబ్బింగ్ ని పూర్తి చేసారు. ఇప్ప‌టికే ఆర్.ఆర్.ఆర్ కి అత్యంత భారీగా బిజినెస్ పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. అందుకే రిలీజ్ ముందే భారీగా హైప్ తేవాల‌న్న ప్లాన్ తో జ‌క్క‌న్న ఇక స్పీడ్ పెంచనున్నార‌ని తెలిసింది. మొత్తానికి రాజ‌మౌళి ప్ర‌చార ఎత్తుగ‌డ ఏమిట‌న్న‌ది తెలుగు మీడియాకి క్లారిటీగానే అర్థ‌మైంది. రిలీజ్ ముంగిట ఇక్క‌డ భారీ ఈవెంట్ తో ఆర్.ఆర్.ఆర్ కి హైప్ తెచ్చే ప్లాన్ చేస్తార‌న్న‌మాట‌.




Tags:    

Similar News