నదియా కొంచెం ఏజ్ బార్ అయిన హీరోయిన్ లా ఉంటుంది. కానీ ఆమెతో అమ్మ, అత్త పాత్రలు వేయించేస్తున్నారు తెలుగు దర్శకులు. తాజాగా ‘బ్రూస్ లీ’ సినిమాలోనూ నదియా ఓ కీలక పాత్రలో నటించింది. అందులో రామ్ చరణ్ కు సైతం వరసకు అత్త అయ్యే పాత్రలో నటిస్తుండటం విశేషం. ఐతే నిన్న బ్రూస్ లీ ఆడియో ఫంక్షన్ కు నదియా తయారై వచ్చిన తీరు చూస్తే మాత్రం ఆమెకు ఇలాంటి ఆంటీ పాత్రలు ఎందుకిస్తున్నారో అని సందేహం కలగడం ఖాయం. ఓ టీనేజ్ అమ్మాయి తరహాలో రెడీ అయి వచ్చింది నదియా.
ఆమెను చూసి యాంకర్ సుమ సైతం ఆశ్చర్యపోయి.. అత్త, అమ్మ పాత్రలెందుకు వేస్తున్నారు? హీరోయిన్ గా చేయొచ్చు కదా అని జోక్ వేసింది. ఐతే నదియా ఆ కామెంట్స్ లైట్ తీసుకుని.. ‘‘వయసు ప్రభావాన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే’’ అని సెలవిచ్చింది. ఆ తర్వాత రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నదియా. తొలి రోజు షూటింగులో తాను, రామ్ చరణ్ అస్సలు మాట్లాడుకోలేదని.. చరణ్ ముభావంగా కనిపించాడని.. అది చూసి అతను చాలా రిజర్వ్డ్ అనుకున్నానని.. కానీ అతనెంత చిలిపివాడో తర్వాత తెలిసిందని నదియా చెప్పింది. చరణ్ చాలా సోషల్ గా, సరదాగా ఉంటాడని.. దీంతో షూటింగ్ చాలా హాయిగా గడిచిపోయిందని ఆమె అంది. ‘బ్రూస్ లీ’లో చరణ్ డ్యాన్సులు - ఫైట్లు - నటన చూసి తాను మెస్మరైజ్ అయిపోయానని.. అతను ఇంకా గొప్ప స్థితికి చేరతాడని నదియా చెప్పింది.