యువ కథానాయకుడు నాగశౌర్య కెరీర్లో విజయాలున్నాయి కానీ.. అతడికి సరైన కమర్షియల్ సక్సెస్ అయితే ఇప్పటిదాకా లేదు. ఆ లోటును ‘ఛలో’ తీర్చేసింది. సినిమా అన్ సీజన్లో.. ‘టచ్ చేసి చూడు’ లాంటి పెద్ద సినిమాకు పోటీగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర నిలబడింది. తొలి వారంలోనే రూ.2 కోట్ల లాభం తెచ్చిపెట్టింది. శాటిలైట్.. ఇతర హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కూడా కలుపుకుంటే ఈ చిత్రం పెట్టుబడిపై రెట్టింపు రాబట్టే అవకాశాలున్నాయి. సొంత బేనర్లో సినిమా చేసి శౌర్య అన్ని రకాలు మంచి ఫలితాన్నే అందుకుంటున్నట్లే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో శౌర్య మాట్లాడుతూ.. ‘ఛలో’ సినిమాతో తన బలాబలాలేంటో తెలిశాయని అన్నాడు. కొత్త దర్శకుడు వెంకీ కుడుముల పట్టుబట్టి ‘ఛలో’లో తనను ఎలా చూపించాలో అలా చూపించాడని అన్నాడు.
ఇక ఇండస్ట్రీలో తనకు ఆదర్శం ఎవరు అని అడిగితే.. నితిన్ అని అతను చెప్పడం విశేషం. దశాబ్దం పాటు ఒక్క హిట్టు లేకపోయినా.. నితిన్ ఆశ కోల్పోకుండా పోరాడి నిలిచాడని.. అందుకే తనకు అతను ఆదర్శమని అతను చెప్పాడు. తన లాంటి హీరోలు వరుసగా రెండు ఫ్లాపులు వస్తేనే అల్లాడిపోతుంటామని.. మరి నితిన్ అన్ని ఫ్లాపులు ఎలా తట్టుకున్నాడో అని శౌర్య వ్యాఖ్యానించడం విశేషం. ఇండస్ట్రీలో అందరు హీరోలూ తనతో బాగానే ఉంటారని.. సినిమా హిట్టయితే అభినందిస్తారని.. ఐతే తానే ఎవరితో సరిగా కలవనని అతనన్నాడు. తాను చేసిన సినిమాల్లో ‘ఒక మనసు’ ఫ్లాప్ అయినప్పటికీ అది మనసుకు నచ్చిన చిత్రమని శౌర్య చెప్పడం విశేషం.