పవర్ స్టార్ పవన్ కళ్యాన్ స్థాపించిన ‘జనసేన’ పార్టీలోకి ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు చేరారు. ఈ అన్నాదమ్ములు ఇద్దరూ జనసేనను ఓన్ చేసుకొని రాజకీయాలు చేస్తున్నారు. అయితే అన్నయ్య చిరంజీవి కూడా వస్తే జనసేన ఎక్కడికో వెళ్లిపోతుందనే ఆశ మెగా ఫ్యాన్స్ లో ఉంది. కానీ చిరంజీవికి మాత్రం రాజకీయాలు అంటే అస్సలు ఆసక్తి లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు.
ఈ వార్తలపై నాగబాబు కూడా స్పందించారు. జనసేనలోకి చిరంజీవి చేరే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు సూటిగా సమాధానమిచ్చారు. నాగబాబు మాట్లాడుతూ.. జనసేనలో చిరంజీవి చేరే అవకాశం ఏమాత్రం లేదని నాగబాబు క్లారిటీ ఇచ్చారు. దానికి కారణం చిరంజీవి రాజకీయాలు వదిలేసే మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారని.. అప్పుడే తాను మళ్లీ ఇక రాజకీయాలలోకి అడుగుపెట్టను అని చెప్పారన్నారు. వస్తే గిస్తే జనసేనలోకే అన్నయ్య వస్తారు అంటూ చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు నాగబాబు.
జనసేనలో చేరితే చిరంజీవి తీసుకున్న నిర్ణయం పాడవుతుందని.. తాము కూడా బలవంతం చేయడం లేదని నాగబాబు క్లారిటీ చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా నాగబాబు ట్విట్టర్ , సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు. తాజా ట్రెండింగ్ టాపిక్ లపై ప్రత్యర్థులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా తమ పాలిటిక్స్ లోకి చిరంజీవిని నాగబాబు లాగేశారు. ఇప్పటికే రాజకీయాల్లోకి వచ్చి చేతులు కాల్చుకున్న చిరంజీవి మళ్లీ జనసేనలోకి వస్తాడనుకుంటే డౌటే.. ఈ టైంలో చిరంజీవిని పెట్టి రాజకీయం చేయాలనుకుంటున్న నాగబాబు వైఖరిపై జనసైనికుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.