స్టైల్ మార్చాడు.. డోస్ పెంచింది

Update: 2017-01-27 12:18 GMT
ఈ మధ్య కాలంలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. సినిమాల కోసం రకరకాల గెటప్ లలో కనిపించడం.. మేకోవర్ చేయడం.. కొత్తలుక్స్ ఇవ్వడంకోసం అన్ని ఏజ్ ల హీరోలు కష్టపడుతున్నారు. అయితే.. సినిమా రిలీజ్ వరకూ అదే గెటప్ తో ఉంటూ.. ప్రమోషన్స్ లో అలాగే పాల్గొనడం ఓ ట్రెండ్ లా నడుస్తోంది.

అక్కినేని నాగార్జున లేటెస్ట్ మూవీ ఓం నమో వేంకటేశాయ చిత్రం కోసం.. బాగా గెడ్డం పెంచి షూటింగ్ చేశాడు. హథీరాం బాబాజీ పాత్ర కావడంతో.. ఇలా గెడ్డం పెంచడం తప్పనిసరి. నాగ్ కూడా ఇదే లుక్ ను కంటిన్యూ చేస్తూ.. సినిమా రిలీజ్ గెడ్డంతోనే ఉంటాడని అంతా ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ సడెన్ నాగార్జున లుక్ మార్చేసి.. మొత్తం గెడ్డం తీసేసి యంగ్ లుక్ లోకి మారిపోయి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఓం నమో వేంకటేశాయ చిత్రంలో నటించిన ప్రగ్యా జైస్వాల్ కూడా.. ఓ రేంజ్ లో అందాలు ఆరబోసేస్తూ.. ప్రమోషన్స్ చేస్తోంది. డిజైనర్ డ్రెసింగ్ తో.. నడుంకి అటూ ఇటూ కట్స్  పెట్టుకుని.. నాభి సౌందర్యాన్ని నడుం ఒంపులను చూపిస్తూ ప్రచారం చేస్తోంది.

సెల్ఫీలు తీసుకుంటూ నాగ్-ప్రగ్యాలు ప్రమోషన్స్ లో చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. భక్తి చిత్రానికి ఇలా గ్లామర్ కోటింగ్ ఇచ్చి ప్రచారం చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది ఓం నమో వేంకటేశాయ టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News