మహానటి సావిత్రితో స్టార్ హీరో

Update: 2018-04-17 17:17 GMT
ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల పాత పోటోలను చూస్తే ఎంత క్యూట్ గా అనిపిస్తాయో అందరికి తెలిసిందే. చాలా వరకు అలాంటి ఫొటోలు కనిపిస్తే అభిమానుల నుంచి కూడా రెస్పాన్స్ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా అలాంటి రెస్పాన్స్ వస్తోంది. అక్కినేని అభిమానులు వారి అభిమాన నటుడి చిన్ననాటి ఫొటో చూసి చాలా మురిసిపోతున్నారు. అది కూడా మహానటి ఆయనతో కనిపించడం స్పెషల్ అని చెప్పాలి.

ఆయన ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. కింగ్ నాగార్జున చిన్న వయసులో ఉన్నప్పుడు మహానటి సావిత్రి ఎత్తుకొని ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక అభిమాని ట్వీట్ చేయగా నాగార్జున షేర్ చేసి మంచి మంచి జ్ఞాపకాన్ని గుర్తు చేసినందుకు కృతజ్ఞతలు అంటూ వెలుగు నీడలు సినిమాలోని ఫోటో అని అభిమానులకు తెలిపాడు. 1961 లో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగేశ్వరరావు - సావిత్రి కి ఆ సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది.

ఇకపోతే అభిమానులు నాగ్ ను చూసి చాలా మురిసిపోతున్నారు. చాలా క్యూట్ గా ఉన్నారు అంటూ పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం నాగ్ అశ్వినిదత్ ప్రొడక్షన్ లో నానితో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీ రామ్ ఆదిత్య ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
Tags:    

Similar News